హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికకు మరో నాలుగు రోజుల సమయం మాత్రమే  ఉందన్న విషయం అందరికీ విధి తమే.  ఉప ఎన్నికలకు సమయం లేకపోవడంతో తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్న యి. నువ్వా నేనా అన్నట్లు... ప్రధాన పార్టీల ప్రచారం కొనసాగుతోంది. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి, ట్రబుల్ షూటర్ తన్నీరు హరీష్ రావు... ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అటు ఈటల రాజేందర్... అన్ని తానై ముందుకు వెళ్తున్నారు. ఇంకా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్నా మా... అంటే చేస్తున్నట్లు ఆ పార్టీ వ్యవహరిస్తోంది. ఈ తరుణంలో ఉదయం నుంచి హుజురాబాద్ నియోజకవర్గ సోషల్ మీడియాలో ఓ సర్వే హల్ చల్ చేస్తోంది. 

సర్వే లో  అధికార టీఆర్ఎస్ పార్టీ... ఘన విజయం సాధిస్తుందని అని తేలింది. ఆ సర్వేలో అధికార టీఆర్ఎస్ పార్టీకి 59 శాతం ఓట్లు వస్తాయని.. అలాగే భారతీయ జనతా పార్టీకి ముప్పై ఒక్క శాతం ఓట్లు వస్తాయని సర్వే తేల్చింది. ఇక కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి పడిపోగా... ఆ పార్టీకి కేవలం ఆరు శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఇక ఇటు ఇతరులు నాలుగు శాతం ఓట్లు సంపాదించినట్లు ఆ సర్వేలో వెల్లడైంది. అయితే ఈ సర్వే టిఆర్ఎస్ పార్టీ చేయించిందని... అసలు విషయం భారతీయ జనతా పార్టీ అని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

ఏది ఏమైనా నవంబర్ రెండో తారీకు ఎవరు గెలుస్తారనే దానిపై క్లారిటీ రానుంది. కాగా హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికలో అధికార టిఆర్ఎస్ పార్టీ తరఫున.. ఉద్యమ నాయకుడు, టిఆర్ఎస్ పార్టీ విద్యార్థి రాష్ట్ర అధ్యక్షుడు... జల్లు శ్రీనివాస్ పోటీ చేస్తుండగా... కాంగ్రెస్ పార్టీ తరఫున...  తెలంగాణ కాంగ్రెస్ విద్యార్థి సంఘం అధ్యక్షుడు బాలమురి వెంకట్ బరిలో దిగుతున్నారు. ఇక అటు  భారతీయ జనతా పార్టీ తరఫున టిఆర్ఎస్ పార్టీ బహిష్కృత నేత,  మాజీ మంత్రి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్న సంగతి మనందరికీ విధితమే.

మరింత సమాచారం తెలుసుకోండి: