ఘ‌నంగా ఇర‌వై వ‌సంతాల పండుగ‌న గులాబీ దండు చేసుకుంది. అంగ‌రంగ వైభ‌వంగా త‌న పండుగ‌ను నిర్వ‌హించి కార్య‌క‌ర్త‌ల‌కు కొత్త ఉత్సాహాన్ని నింపింది. ముందుస్తు ఎన్నిక‌లు ఉన్నాయో లేవో కానీ ఆ స్థాయిలో ప్లీన‌రీ నిర్వ‌హించి సంతోషాలు పంచుకుంది పార్టీ అధినాయ‌క‌త్వం. ఇన్నాళ్లూ తిరుగులేని విధంగా పాల‌న చేసిన కేసీఆర్ ను తొమ్మిదో సారి కూడా పార్టీ అధ్య‌క్షుడిగా ఎన్నుకుంది. ఇవ‌న్నీ బాగానే ఉన్నాయి కానీ ఇప్పుడు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు కేసీఆర్ ఊహించని విధంగా ట్విస్టు ఇచ్చారు. మ‌హమ్మారి క‌రోనా నియంత్ర‌ణ లో భాగంగా ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుని అంద‌రి గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తించారు. ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా ఉండే కేసీఆర్ నిర్ణ‌యాలు కొన్ని దిగ్బ్రాంతిక‌రంగా ఉంటాయి అనేందుకు ఉదాహ‌ర‌ణే ఈ తాజా ప‌రిణామం.

ఎలా అంటే..?
క‌రోనా టీకా వేసుకోకుంటే రేష‌న్ క‌ట్ అని చెబుతున్నారు కేసీఆర్. ఇదే క‌దా ప్లీన‌రీ కానుక అంటే..? ఈ నేప‌థ్యంలో కేసీఆర్ నిర్ణ‌యం పై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ ను అమ‌లు చేసే ప‌ద్ధ‌తి ఇది కాద‌ని, ఇలా చేస్తే చాలా మంది టీకాపై అవ‌గాహ‌న లేని వారు అవ‌స్థ‌లు ప‌డ‌డం ఖాయం అని ప‌లువురు వాపోతున్నారు. రేష‌న్ తో పాటూ పింఛ‌న్ కూడా క‌ట్ చేస్తామ‌ని సంబంధిత అధికారులు చెబుతుండ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం. వ‌చ్చే నెల ఒక‌టో తారీఖు నుంచి అమ‌లు అయ్యే ఈ ఆదేశాల‌కు సంబంధించి ఇప్ప‌టి నుంచే టెన్ష‌న్ మొద‌ల‌యింది ప్ర‌జ‌ల‌లో! టీకా వేసుకోకుంటే ఎక్క‌డ రేష‌న్, పింఛ‌న్ నిలుపుద‌ల చేస్తారోన‌ని భ‌యంతో సమీప వైద్య కేంద్రాల‌కు ప‌రుగులు తీస్తున్నారు. థ‌ర్డ్ వేవ్ భ‌యాలు అల‌ముకుంటున్న నేప‌థ్యంలో ప్ర‌తి ఒక్క‌రూ రెండు డోసుల టీకా తీసుకోవ‌డం మంచిద‌ని, ఇదే క‌రోనా నియంత్ర‌ణ‌కు మంచి మార్గ‌మ‌ని వైద్యాధికారులు చెబుతున్నారు. అయితే పింఛ‌నుకూ, రేష‌న్ కూ ఎందుకు లింకు పెట్టారో అన్న‌ది అర్థం కాక జ‌నం బుర్ర‌లు గుద్దుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

trs