చిత్తూరు జిల్లా వైసీపీ లో బ‌ల‌మైన నేత‌ల్లో చంద్ర‌గిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి ఒక‌రు. ఆయ‌న గ‌త రెండు ట‌ర్మ్‌లుగా గెలుస్తూనే వ‌స్తున్నారు. పైగా రెండు సార్లు టీడీపీ నుంచి పోటీ చేసిన క‌మ్మ నేత‌లు గ‌ల్లా అరుణ‌, పులివ‌ర్తి నానినే ఓడించారు. అయితే ఈ సారి చంద్ర‌గిరిలో చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డిని ఎలాగైనా ఓడించాల‌నే ప‌ట్టుద‌ల‌తో టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఉన్నార‌న్న‌ది వాస్త‌వం. పైగా ఇది బాబుకు సొంత నియోజ‌క‌వ‌ర్గం.

త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన చంద్ర‌గిరిలో వైసీపీ త‌ర‌పున చెవిరెడ్డి రెండు సార్లు గెలిచి త‌న కంచుకోట‌గా మార్చుకోవ‌డం బాబు జీర్ణించు కోలేని ప‌రిస్థితి. గ‌త ఎన్నిక‌ల్లో అయితే నానిపై చెవిరెడ్డి ఏకంగా  41,755 ఓట్ల భారీ మెజార్టీతో ఘ‌న‌విజ‌యం సాధించారు. చివ‌ర‌కు ఇదే నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న నారా వారి ప‌ల్లె లో సొంత ఎంపీ టీసీని కూడా బాబు నిల బెట్లుకోలేక పోయారు. ఈ క్ర‌మంలోనే 2024 ఎన్నిక‌ల్లో గెలుపు టార్గెట్ గా బాబు చంద్ర‌గిరి పై స్పెష‌ల్ ఫోక‌స్ చేస్తున్నారు.

అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఇక్క‌డ టీడీపీ క‌మ్మ‌ల‌కే సీటు ఇస్తూ వ‌స్తోంది. ఈ సారి మాత్రం క‌మ్మ‌ల‌ను ప‌క్క‌న పెట్టేసి ఓ రెడ్డి నేత‌కు ఇక్క‌డ సీటు ఇవ్వాల‌ని బాబు నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌. రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన ఓ దివంగ‌త ఎమ్మెల్యే కుమారుడి పేరు చ‌ర్చ‌ల్లో వ‌స్తోంది. ఆయ‌న తిరుప‌తి సీటు అడిగితే అక్క‌డ బ‌లిజ‌ల‌కు ఇస్తామ‌ని.. మీకు చంద్ర‌గిరి ఇస్తామ‌ని బాబు చెప్పిన‌ట్టు టాక్ ?

గ‌తంలో తిరుప‌తి అసెంబ్లీ నియోజక‌వ‌ర్గ ప‌రిధిలో  తిరుప‌తి రూర‌ల్ మండ‌లం ఉంది. అప్పుడు ఆ కుటుంబానికి తిరుప‌తి లో నూ, అటు చంద్ర‌గిరిలోని రెడ్ల‌లోనూ కాస్త ప‌ట్టు ఉంది. అందుకే ఇప్పుడు స‌ద‌రు నేత‌ను రంగంలోకి దింపి చెవిరెడ్డికి చెక్ పెట్టించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. మ‌రి బాబు వ్యూహాలు ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తాయో ?  చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: