సవాళ్లు, ప్రతిసవాళ్లు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో నెల రోజులుగా ఉదృతంగా సాగిన హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారానికి రేపటితో  తెరపడనుంది. మరి కొన్ని గంటలే ప్రచారానికి సమయం ఉండడంతో  ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నారు ప్రధాన పార్టీల అభ్యర్థులు. హుజురాబాద్  ఉప ఎన్నికను మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపు మాదంటే, మాదని ధీమా వ్యక్తం చేస్తాయి. మరోవైపు ఈ నెల 30న జరిగే పోలింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. హుజురాబాద్ లో రేపు రాత్రి 7 గంటలతో ఉప ఎన్నికల ప్రచారం ముగియనుంది.

గతంలో ఎన్నడూ లేనివిధంగా 72 గంటల ముందుగానే ప్రచారానికి తెరదించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఈసారి ఆదేశించింది. దీంతో మూడు ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ప్రధానంగా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని సంబంధించినటువంటి ప్రచార సరళి మొదటి నుంచి అధికార టీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల ప్రాసెస్ మొదలవుతుందన్నప్పటి నుంచే ప్రచారాన్ని మొదలు పెట్టింది. ఈటెల రాజేందర్ రాజీనామా చేయక ముందు నుంచే తన ప్రచారాన్ని కొనసాగించాడు. ఇప్పటికీ ప్రచారం అటు కాంగ్రెస్ పార్టీ ఎటు టిఆర్ఎస్, బిజెపి మూడు పార్టీలు కూడా ప్రచారాన్ని ఉర్రూతలూగించాయి. బిజెపి నుంచి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నుంచి మొదలుకొని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ వరకు కూడా పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రచారంలో తలమునకలయ్యారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులంతా కూడా ప్రచార పర్వంలో మునిగిపోయారు. రేపు సాయంత్రం వరకు కూడా పార్టీకి సంబంధించిన నాయకులు ఇక్కడ ప్రచారం చేయబోతున్నారు.

మిగతా ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులంతా రేపటితో హుజురాబాద్ ను వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆఖరి రోజు ప్రచారానికి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి హుజురాబాద్ లో సభను ఏర్పాటు చేసారు. అధికార టీఆర్ఎస్ పార్టీలో మంత్రి హరీష్ రావు పూర్తిగా దగ్గరుండి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. పోలీసులు మాత్రం వచ్చే 72 గంటల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు గాని, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన కఠినమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: