బద్వేలు బిజెపి కార్యాలయంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఇతర మంత్రుల ఛాలెంజ్ ను బిజెపి స్వీకరిస్తుంది అని వేదిక సమయం చెప్తే చర్చకు సిద్ధం అని ఆయన సవాల్ చేసారు. సీఎం ఉప ఎన్నిక సమయంలో రైతుల అకౌంట్లలో డబ్బులు వేస్తామంటున్నారు అని ఆయన తెలిపారు. బద్వేలు ఉప ఎన్నికల పై ఎపి మంత్రులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మాటలు వక్రీకరిస్తూ ప్రతి సవాల్ విసురుతున్నారు అని పేర్కొన్నారు.

రాయలసీమ లో  4 జిల్లాల వైసీపీ  ఎమ్మెల్యేలు లక్ష ఓట్ల మెజారిటీ కోసం తిరుగుతున్నారు అని ఎద్దేవా చేసారు. 3 ఎంపీలు, ఇద్దరు మంత్రులు, చీఫ్ విప్, విప్ లు అందరూ ఎన్నికల ప్రచారం లో పాల్గొంటున్నారు అని అన్నారు. ఓటమి భయంతో వైసీపీ నేతల అవాకులు చెవాకులు పెలుతున్నారు అని వ్యాఖ్యానించారు.  కోందరు వైసీపీ నేతలు ఇసుక మాఫియా చేయడం లేదా అని ఆయన నిలదీశారు. సోము వీర్రాజు బద్వేలు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు అని అన్నారు.

మంత్రులది పక్క జిల్లా కాదా అని ప్రశ్నించారు. ఇసుక దందా పై బీజేపీ చర్చకు సిద్ధంగా ఉంది అని అన్నారు. కేంద్ర హామీలు నెరవేర్చలేదని చీఫ్ విప్ , మంత్రులు మాట్లాడుతున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. కడప జిల్లాలో నే పాదయాత్రలో ఇచ్చిన హామీలు జగన్ నెరవేర్చలేదు అని ఆరోపణలు చేసారు. ప్రజల ఆస్తులు కరిగిపోతున్నాయిఎపి లో వైసీపీ నేతల ఆస్తులు పెరిగాయి అని ఆయన తెలిపారు. బద్వేలు ప్రజల కష్టాలు పట్టించుకోని వైసీపీ.. సవాల్ ను బీజేపీ స్వీకరిస్తుంది అని స్పష్టం చేసారు. సవాల్ స్వీకరిస్తారో పారిపోతారో వైసీపీ వాళ్ళు తేల్చుకోవాలి అని అన్నారు ఆయన. బద్వేలు అభివృద్ధి పై చర్చకు సిద్ధమా అని సవాల్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bj[