ఎట్ట‌కేల‌కు ఎమ్మెల్యేల‌కు జ‌గ‌న్ అపాయింట్మెంట్ దొరికింద‌ని, జిల్లాల వారీగా త్వ‌ర‌లో ఆయ‌న భేటీ కానున్నార‌ని తెలుస్తోంది. ఇందుకు సం బంధించి ప్రాథ‌మిక స‌మాచారం ఆధారంగా అందిస్తున్న క‌థ‌నం ఇది. ఇప్ప‌టిదాకా క్షేత్ర స్థాయిలో ఉన్న స‌మస్య‌లు, ముఖ్యంగా ని ధుల లోటు, అభివృద్ధి లోటు అన్న‌వి ఎలా ఉన్నాయో అన్న‌ది ఆయ‌న రిపోర్టులు తెప్పించుకున్నారు. వీటిపై అధ్య‌య‌నం చేశాకే ఎ మ్మెల్యేల‌తో మాట్లాడ‌తారు. ఇప్ప‌టిదాకా ప్ర‌భుత్వం ఏర్పాటైనా తాము సీఎంతో మాట్లాడ‌లేక‌పోయామ‌ని ఎమ్మెల్యేలు భావిస్తు న్న తరుణాన జ‌గ‌న్ ఇచ్చిన లేదా ఇవ్వ‌నున్న ఆఫ‌ర్ అన్న‌ది అంతా మ‌న మంచికే అన్న ధోర‌ణికి చెందిదై ఉంది. బాగుంది ఇన్నా ళ్ల‌కు అ య్యగారి అపాయింట్మెంట్ అన్న‌ది దొర‌క‌డం త‌మ భాగ్య‌మేన‌ని కొంద‌రు ఎమ్మెల్యేలు మురిసి పోతుంటే, మ‌రికొంద‌రు బెంగ‌తోనో, భయంతోనో ఆందోళ‌న చెందుతున్నారు.

స్థానిక ఎన్నిక‌ల ఫ‌లితాలు త‌రువాత వైసీపీలో ధీమా క‌నిపిస్తున్నా అదేమీ గొప్ప విజ‌యం కాద‌నే తేలిక భావ‌న కూడా కొంద‌రిలో ఉంది. ఎందుకంటే అధికార పార్టీ క‌నుస‌న్న‌ల్లో జ‌రిగిన ఎన్నిక‌లు ఇవి. క‌నుక సాధించిన విజ‌యాలు త‌ల్చుకుని అతి విశ్వాసానికి పోవ‌ద్ద‌ని మొన్న‌టి వేళ డిప్యూటీ సీఎం ధ‌ర్మాన కృష్ణ‌దాసు అన్నారు. ఇదే క‌నుక పార్టీ అభిప్రాయం కూడా అయితే ఇంకా బాగుం టుంది.  వ్య‌క్తిగ‌తంగా ఆయ‌న అభిప్రాయం ఇదే అయినా దీనిని కొంద‌రు గుర్తించే స్థితిలో లేరు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ నుంచి వ‌చ్చిన పిలుపు కొంద‌రికి ప‌ద‌వీ గండం ఖాయం అన్న విష‌యం కూడా తేలిపోయింది. సిట్టింగ్ ల‌ను కొంద‌రిని ఆయ‌న రిపీట్ చేయ‌ర‌ని కూడా అంటున్నారు. బాగా ప‌నిచేయ‌ని వారికి వ్య‌క్తిగత భేటీల్లో భాగంగా హెచ్చ‌రిక‌లు కూడా చేయ‌నున్నారు జ‌గ‌న్. ఇవ‌న్నీ జ‌రిగితే పార్టీ బాగు ప‌డ‌డ‌మే కాకుండా రానున్న రెండున్న‌రేళ్ల‌లో ప్ర‌భుత్వ ప‌నితీరు ప్ర‌జ‌ల్లోకి తీసుకుపోయేందుకు కూడా అవ‌కాశం ఉంది. ఇదే భావ‌న‌తో సీఎం జ‌గ‌న్ ఉన్నారు. త్వ‌ర‌లో వీరితో మాట్లాడేందుకు స‌మాయ‌త్తం అవుతున్నారు. అదేవిధంగా ప‌నితీరు బాగాలేని వారిపై ఫోక‌స్ పెంచేందుకు ఈ అవకాశాన్ని స‌ద్వినియోగం చేసుకోనున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

ycp