జగన్ విషయంలో చాలా మంది చాలా రకాలైన రాజకీయ విశ్లేషణలు చేస్తూ ఉంటారు. జగన్ ఫలానా పక్షమని అంటారు. ఆయన ఒంటరి అని కొందరు అంటారు. ఇక జగన్ రాజకీయ వ్యూహాలు చూస్తే ఎవరికీ అందవని వేరే చెప్పాల్సిన అవసరం అయితే లేదు.

ఇవన్నీ ఇలా ఉంటే జగన్ కేంద్రంలోని బీజేపీకి చాలా విషయాల్లో మద్దతు ఇస్తూ వస్తున్నారు. దాని వల్ల ఏపీకి ఏమైనా రాజకీయ లాభం ఉందా అంటే పెద్దగా లేదు అని చెప్పాలి. పోలవరం నిధులు పూర్తి స్థాయిలో ఇవ్వకుండా కేంద్రం కోత పెడుతోంది, అదే టైమ్ లో విభజన హామీలు ఏవీ పక్కాగా అమలు కాలేదు, నిధుల కొరత ఉన్న ఏపీని ఏ విధంగానూ స్పెషల్ గ్రాంట్స్ ఇచ్చి ఆదుకోవడంలేదు. మొత్తానికి జగన్ బీజేపీ పట్ల చూపుతున్న కొంత పాజిటివ్ నెస్ అయినా ఏపీకి ఏ రకంగానూ కలసిరావడంలేదు అనే అనుకోవాలి.

ఇవన్నీ పక్కన పెడితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అన్నది ఏపీ సర్కార్ కి కూడా పెను సవాల్ కాబోతోంది అనే అనుకోవాలి. ఏపీలో ఉన్న అతి పెద్ద ఉక్కు కర్మాగారం కనుక ప్రైవేట్ పరం అయితే ఇక చేసేది ఏమీ ఉండదు, ప్రత్యేక హోదా లేక రాకా పారిశ్రామికంగా ఏపీ వెనక్కిపోయింది. ఈ నేపధ్యంలో కేంద్రం విషయంలో జగన్ తన ఆలోచనలు మార్చుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు సూచిస్తున్నారు. బీజేపీ జట్టు నుంచి జగన్ అర్జంటు గా బయటకు రావాలని కూడా ఆయన కోరుతున్నారు. పెట్రోల్, డీజిల్ సహా అన్ని ధరలను పెంచేసి ప్రైవేట్ కి పెద్ద పీట వేస్తున్న బీజేపీని కనుక సపోర్ట్ చేస్తే దానితో పాటు జగన్ కూడా వీక్ అవుతారు అని ఆయన హెచ్చరిస్తున్నారు. మరి జగన్ ఈ మాట వింటారా. ఇంతకీ ఆయన బీజేపీకి మద్దతు ఇస్తున్నారా, లేదా. మొత్తానికి సీపీఎం చెప్పిన మాటలు జగన్ కి ఇష్టమేనా. చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: