బాపట్ల పార్లమెంట్ స్థానం...గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆధిక్యత కాస్త కనిపించిన స్థానం. గత ఎన్నికల్లో 25 పార్లమెంట్ స్థానాల్లో 24 చోట్ల వైసీపీ హవానే నడిచింది...కానీ బాపట్ల పార్లమెంట్ పరిధిలో టీడీపీకి కాస్త ఆధిక్యత వచ్చింది. ఇక్కడ ఏడు నియోజకవర్గాల్లో టీడీపీ నాలుగు చోట్ల గెలిచింది..ఇక వైసీపీ మూడు చోట్ల గెలిచింది. కానీ బాపట్ల పార్లమెంట్‌ని వైసీపీ తక్కువ మెజారిటీతో కైవసం చేసుకుంది. బాపట్ల పార్లమెంట్ పరిధిలో పర్చూరు, అద్దంకి, రేపల్లె, చీరాల స్థానాలు టీడీపీ గెలుచుకోగా, వేమూరు, బాపట్ల, సంతనూతలపాడు స్థానాలని వైసీపీ కైవసం చేసుకుంది.

అయితే ఎన్నికలై రెండున్నర ఏళ్ళు అయింది..మరి ఇప్పుడు ఆ బాపట్ల పార్లమెంట్ స్థానంలో రాజకీయం ఎలా ఉందనే విషయాన్ని గమనిస్తే...ఇప్పుడు కూడా టీడీపీకి పట్టు ఉందని కనబడుతుంది. కాకపోతే కొన్ని స్థానాల్లో పరిస్తితి అటు...ఇటు అయింది. కానీ లీడ్ మాత్రం టీడీపీ వైపే కనిపిస్తోంది. ముఖ్యంగా బాపట్ల పార్లమెంట్ స్థానంలో వైసీపీకి ఎదురుగాలులు వీస్తున్నాయి...ఇక్కడ వైసీపీ ఎంపీ నందిగం సురేష్ ప్రజా వ్యతిరేకత ఎక్కువ ఎదురుకుంటున్న ఎంపీల లిస్ట్‌లో ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి...అంటే ఈ సారి బాపట్ల పార్లమెంట్ స్థానంలో టీడీపీకి లక్కీ ఛాన్స్. అటు పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల్లో టీడీపీ ఇప్పటికీ స్ట్రాంగ్ గానే ఉంది...ఎందుకంటే టీడీపీ ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్‌ల ప్రభావం వల్ల టీడీపీ బలంగా ఉంది.


ఇటు చీరాలలో టీడీపీ తరుపున గెలిచిన కరణం బలరాం వైసీపీ వైపుకు వెళ్లారు. దీంతో ఇక్కడ టీడీపీ వీక్ అయింది. అటు రేపల్లెలో టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ బలం కూడా తగ్గినట్లు కనిపిస్తోంది. ఇక్కడ వైసీపీ బలం పెరిగినట్లు తెలుస్తోంది. ఇక వైసీపీ సిట్టింగ్ సీట్లుగా ఉన్న బాపట్ల, వేమూరు, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో అనూహ్యంగా టీడీపీ పికప్ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే వేమూరులో టీడీపీ బలం పెరిగింది..వచ్చే ఎన్నికల నాటికి మూడు చోట్ల టీడీపీ బలం పెరగొచ్చు...మొత్తానికైతే బాపట్ల పార్లమెంట్ పరిధిలో ఆధిక్యం టీడీపీకే ఉన్నట్లు కనిపిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: