తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్హ్యలు చేసారు నేడు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షం తిరుమలను అతలాకుతలం చేసింది అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. తిరుమల - తిరుపతిలో ఒక్కరోజులో 15 సె.మీ వర్షం కురిసింది అని ఈ సందర్భంగా తెలిపారు. భారీ వర్షం నగర ప్రజలను భయాందోళనలకు గురిచేసింది అని ఆవేదన వ్యక్తం చేసారు. సీఎం జగన్ ఆదేశాలతో వరద ప్రభావాన్ని అంచనా వేసి ముందస్తు చర్యలు చేపట్టాము అని ఈ సందర్భంగా స్పష్టం చేసారు. వరద బాధితులకు తక్షణ సహాయంగా 2 వేలు, నిరంతర ఆహార సదుపాయాలు అందజేస్తున్నాము అని అన్నారు.

16 వేల కుటుంబాలకు పైగా నిత్యావసర వస్తువుల వితర చేయడం జరిగింది అని ఆయన తెలిపారు. దెబ్బ తిన్న ప్రాంతాల మరమ్మత్తులు యద్ధప్రాతిపధికన చేపట్టాము  అన్నారు. వైసిపీ కార్యకర్తలు మునిసిపల్ సిబ్బందితో కలిసి అన్ని కార్యక్రమాలలో పాల్గొంటున్నారు అని చంద్రబాబును కొన్ని సూటి ప్రశ్నలు సంధిస్తున్నా అంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు తొమ్మిదిన్నర హయాంలో తిరుపతిలో 44 చేరువులు ఆక్రమణలకు గురైయ్యాయి అని ఆయన వివరించారు. నగర మార్కెట్, తుడా కార్యాలయం అన్ని ఆయన హయాంలో ఆక్రమణ చేయబడ్డవే  అని మండిపడ్డారు.

చంద్రబాబు తిరుపతిలో అడుగుపెట్టే ముందు నగర వాసులకు క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేసారు. ఆ నాడు చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పు ఈనాడు తిరుపతి ప్రజల పాలిటి శాపంలా మారింది అని అన్నారు. తిత్లీ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యల పేరుతో చంద్రబాబు హై డ్రామా వేశాడు అని విమర్శించారు. పుష్కరాల సమయంలో తన స్వలాభం కోసం 40 మందిని పొట్టన పెట్టుకున్నాడు చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఐదు రోజులగా తిరుపతిలో వైసిపీ నాయకులు, కార్యకర్తలు నిర్విరామంగా సహాయక చర్యలలో పాల్గొంటున్నారు  అని అన్నారు. సీఎం జగన్ ను తిరుపతి డ్రైనేజీ వ్యవస్థ పునరుద్ధరణకు 189 కోట్లు నిధులు కేటాయించాలి అని కోరాను అని తెలిపారు. సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు త్వరలోనే కేటాయింపులు జరుగుతాయి అని స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp