జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేశారు.  జిహెచ్ఎంసీ ఆఫీస్ పై బీజేపీ శ్రేణుల దాడిని ఖండిస్తున్నామని.. గతంలో కూడా బీజేపీ కార్పొరేటర్లు ధర్నా చేశారని ఫైర్ అయ్యారు గద్వాల్ విజయలక్ష్మి.  ఈ రోజు బీజేపీ కార్పొరేటర్లు ధ్వంసం చేసింది పబ్లిక్ ప్రాపర్టీ కాదా?  నేను టీఆర్ఎస్ మేయర్ లా కాకుండా కార్పొరేటర్లు అందరిని కలుపుకొని వెళ్తున్నానన్నారు గద్వాల్ విజయలక్ష్మి.   మీకు మీరే చేసారా.. మీ అధిష్టానం ఆదేశాలతో బల్దియా ఆఫీస్ పై దాడి చేశారా? వర్షాల టైంలో బీజేపీ కార్పొరేటర్ల ప్రాంతాల్లో కూడా పర్యటించామన్నారు  గద్వాల్ విజయలక్ష్మి. జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుందాం అని అనుకున్నామని... కానీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంది. ఒక ఎడ్యుకేటెడ్ ప్రజాప్రతినిధులుగా మీకు తెలియదా? అని ఫైర్  అయ్యారు  గద్వాల్ విజయలక్ష్మి..  


నిరసన పేరుతో విధ్వంసం చేస్తే చూస్తూ ఊరుకొమని... మాకు చేత కాక కాదు. మా కార్పొరేటర్లు కూడా కాల్స్ చేస్తున్నారు ఈ ఘటనపై.. గ్రేటర్ లో అభివృద్ధి పనులు మీకు కనపడటం లేదా.?  అని నిలదీశారు.  నగరానికి స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు వచ్చాయి. ఇ వి ఓర్వలేక ఇలాంటివి చేస్తున్నారు... మీకు మీ అధిష్టానం చెప్పినా.. ఇలాంటిది చేయడానికి మీకు సిగ్గు శరం లేదా? అని ఫైర్ అయ్యారు  గద్వాల్ వి జయలక్ష్మి. విధ్వంసం దేనికి చేశారు..? ఎవరు చెప్తే చేశారో చెప్పాలి. నేను కార్పొరేటర్ అనుభవం నుంచి మేయర్ గా వచ్చా నాకు తెలుసు కార్పొరే టర్లు బాధ్యత అన్నారు  గద్వాల్ విజయలక్ష్మి. గ్రేటర్ కార్పొరేటర్లుగా ఉండి జిహెచ్ఎంసీ బోర్డుపై బ్లాక్ స్ప్రే కొట్టడం ఏంటి?  దాన్ని వాళ్ల విజ్ఞతకే వది లే స్తున్నా అని ఫైర్ అయ్యారు.
బాధ్యతాయుతంగా ఉండాల్సిన కార్పొరేటర్లు ఇలా ధ్వంసం చేస్తారని అనుకుంటామా అని నిలదీ శా రు  గద్వాల్ విజయలక్ష్మి.

మరింత సమాచారం తెలుసుకోండి: