టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి పార్టీలు మద్దతు లేదు అనే వ్యాఖ్యలు గత కొన్ని రోజులుగా మనం వింటూనే ఉంటాం. రాజకీయంగా పార్టీని చంద్రబాబు నాయుడు సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్న సరే కొంతమంది కీలక నాయకులు నుంచి ఆయనకు సహకారం లేకపోవడం రాష్ట్ర ప్రభుత్వం నుంచి విమర్శలు వచ్చిన సమయంలో చంద్రబాబు నాయుడు కి అండగా నిలబడి నాయకత్వం లేకపోవడం వంటివి ప్రధాన సమస్యగా మారుతుంది. చాలామంది నాయకులు ఇతర పార్టీల వైపు చూస్తున్న సరే అలాగే నాయకులు వారి తో మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేకపోతున్నారు అనే భావన ఇప్పుడు పార్టీలో   వ్యక్తమవుతోంది.

చాలామందిలో కొన్ని కొన్ని అనుమానాలు ఉన్నా సరే రాష్ట్ర నాయకత్వం వాటిని అభివృద్ధి చేయలేకపోతున్న అని క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు ధైర్యం చెప్పలేకపోతోంది అని చాలా మంది సీనియర్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో కొంతమంది కీలక నాయకులు అధికార పార్టీలో జాయిన్ అయ్యేందుకు మార్గం సుగమం చేసుకున్నట్టుగా ప్రచారం జరిగినా సరే కనీసం వాళ్ళ తో చంద్రబాబు మినహా మరో నాయకుడు మాట్లాడలేదు. ఇక విశాఖ జిల్లాలో కొంతమంది కీలక నాయకులు విజయసాయి రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం రాగా చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని మాట్లాడటమే గానీ అక్కడ ఉన్న నాయకులు ఎవరు మాట్లాడలేదు..

ఇక రాయలసీమ జిల్లాల్లో కూడా చంద్రబాబు నాయుడికి సహకారం లేదని అనుమానాలు చాలావరకు బలపడుతున్నాయి. రాయలసీమ వరదల సమయంలో పార్టీ అధిష్టానం చెప్పిన సరే అక్కడున్న నాయకులు ఎవరూ కూడా ప్రజల్లోకి వెళ్లి కనీసం కార్యక్రమాలు కూడా చేయలేకపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే అంశం అయినా సరే గట్టిగా మాట్లాడలేక చాలామంది నాయకులు ఈ మధ్యకాలంలో వెనక్కు తగ్గడం వంటివి చంద్రబాబునాయుడికి బాగా ఇబ్బంది గా మారిన అంశంగా చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: