పశ్చిమ గోదావరి జిల్లాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటివరకు వైసీపీకి అనుకూలంగా నడిచిన రాజకీయం ఇప్పుడు..కాస్త మారిందనే చెప్పాలి. అనూహ్యంగా కొన్ని చోట్ల టీడీపీ నేతలు పుంజుకుంటున్నారు. జిల్లాలో ప్రస్తుతం వైసీపీదే లీడింగ్ అనే సంగతి తెలిసిందే. జిల్లాలోని 15 స్థానాల్లో 13 చోట్ల ఆ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇక 2 చోట్ల మాత్రమే టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు.

అంటే జిల్లాపై వైసీపీకి ఆధిక్యం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. కానీ ఆ ఆధిక్యం కాస్త మారుతూ వస్తున్నట్లు కనిపిస్తోంది. అన్నీ నియోజకవర్గాల్లో కాదు గానీ, కొన్ని చోట్ల వైసీపీకి ధీటుగా టీడీపీ వచ్చింది. అలాగే కొన్ని చోట్ల టీడీపీ నేతలు లీడ్‌లోకి వచ్చినట్లు తెలుస్తోంది. అలా టీడీపీలో లీడ్ పెంచుకుంటున్న నేతల్లో ముగ్గురు కమ్మ నేతలు ఉన్నారు. చింతమనేని ప్రభాకర్, అరిమిల్లి రాధాకృష్ణ, గన్నీ వీరాంజనేయులు ఉన్నారు.

ఈ ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు గత ఎన్నికల్లో ఓడిపోయారు. చింతమనేని..దెందులూరు బరిలో, అరిమిల్లి...తణుకులో, గన్నీ..ఉంగుటూరులో ఓటమి పాలయ్యారు. అయితే ఓడిపోయాక ఈ ముగ్గురు నేతలు సైలెంట్ అవ్వలేదు. మళ్ళీ తిరిగి పుంజుకోవడానికి గట్టిగా పనిచేస్తూ వచ్చారు. ఇంటికే పరిమితం కాకుండా నియోజకవర్గంలో తిరగడం మొదలుపెట్టారు. ప్రజా సమస్యలపై గట్టిగానే గళం విప్పారు. ఎక్కడకక్కడ పార్టీ తరుపున పోరాటాలు చేశారు. పైగా వైసీపీపై వ్యతిరేకత కూడా పెరగడం ఈ నేతలకు బాగా కలిసొచ్చింది. వీరికి ప్రత్యర్ధులుగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత పెరుగుతుందని తెలుస్తోంది.

ముఖ్యంగా దెందులూరులో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరీపై బాగా వ్యతిరేకత ఉందని తెలుస్తోంది. అదే చింతమనేనికి ప్లస్ అవుతుంది. ఇప్పటికే దెందులూరులో చింతమనేని లీడ్‌లోకి వచ్చినట్లు తెలుస్తోంది. నెక్స్ట్ ఎన్నికల్లో ఈయన గెలుపుని ఆపడం కష్టమని తెలుస్తోంది. అటు తణుకులో అరిమిల్లి, ఉంగుటూరులో గన్నీ కూడా బాగా లీడ్ పెంచుకున్నట్లే కనబడుతోంది. వచ్చే ఎన్నికల్లో గన్నీ, అరిమిల్లి గెలుపు కూడా సులువే అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: