ఢిల్లీః తొలి రోజే లోక్‌సభలో మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు పెట్టాలని కేంద్ర సర్కార్ భావిస్తోంది. ఈ మేరకు సభ కార్యకలాపాల జాబితా లో ప్రభుత్వం పొందుపరిచినట్లు సమాచారం అందుతోంది. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల తొలి రోజు న “మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ బిల్లు”ను లోక్‌సభలో ప్రవేశపెట్టాలని మోడి సర్కార్ ఆలోచన చేస్తోంది. 2020 సెప్టెంబర్‌లో పార్లమెంట్‌ చేసిన ఈ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న రైతులు...ఈ చట్టాలకు సంబంధించిన ఆర్డినెన్స్‌ తీసుకొచ్చినప్పటి నుంచి ఆందోళన చేస్తున్నారు రైతులు. 2020 సెప్టెంబర్ లో
ఆర్డినెన్స్‌ లను చట్టాలుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌ లో బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించుకున్నప్పటి నుంచి  ఉద్యమాన్ని ఉధృతం చేసిన  రైతులు... ఈ వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని “సంయుక్త కిసాన్‌ మోర్చా” ఆధ్వర్యంలో ఏడాది కి పైగా కొనసాగుతున్నాయి ఆందోళనలు.

ఈ ఏడాది నవంబర్‌ 19న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగలో “మూడు వ్యవసాయ చట్టాలను”
రద్దు చేస్తున్నట్లు ప్రకటన వచ్చిన సనగతి తెలిసిందే. చట్టాల రద్దుకు  సంబంధించిన రాజ్యాంగ ప్రక్రియ రానున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో పూర్తి చేస్తామని ప్రధాని మోడి ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఏడాది జనవరిలోనే కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య జరుగుతున్న చర్చల ప్రక్రియను సులభతరం చేయడానికి తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు ఈ చట్టాల అమలుపై స్టే విధించింది  సుప్రీం కోర్టు.
చర్చల కోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసిన సుప్రీం కోర్టు... అయితే, కమిటీ ఏర్పాటు ను నిర్ద్వందంగా తిరస్కరించారు రైతు సంఘాల నాయకులు.
ఈ వివాదస్పద చట్టాల కారణంగా “వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌ కమిటీలు” రద్దు అవుతాయని, “కనీస మద్దతు ధర” యంత్రాంగం నిర్వీర్యమైపోతుందని, “కార్పొరేట్‌ దోపిడి”కి మార్గం సుగమం అవుతుందని భయాందోళనలు  వ్యక్తం చేస్తున్నారు రైతులు.  

మరింత సమాచారం తెలుసుకోండి: