నేడు  కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరుగనున్న సనగతి తెలిసిందే.  హైకోర్టు ఆదేశాలతో  మూడోసారి సమావేశం జరుగ నుంది. ఇందులో బాగంగానే ఇవాళ ఉదయం 10:30కు కౌన్సిల్ సమావేశం ప్రారంభం కానున్నట్లు సమాచారం అందుతోంది.  మొదటిగా సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం చైర్మన్ ఎన్నిక జరుగనుంది.   ఎక్స్ అఫీషియో సభ్యుడిగా సమావేశానికి హాజరు కావాలంటూ ఎన్నికల అధికారి నుంచి కేశినేని నానికి సమాచారం అందుతోంది. మున్సిపల్  చైర్మన్ ఎన్నిక సందర్భంగా గొల్లపూడి, ఇబ్రహీంపట్నం, కొండపల్లి ప్రాంతాల్లో ఉద్రిక్తత ఉండనుంది. గత రెండు రోజుల నుంచి జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. 

తమ తరఫున గెలిచిన అభ్యర్థులను ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రలోభాలకు గురిచేస్తున్నారంటున్నారు  టీడీపీ నేతలు. కేశినేని నానికి ఓటేసే అర్హతే లేదంటున్న వైసీపీ.. పోటాపోటీగా కొనసాగుతున్న వైసీపీ, టీడీపీ క్యాంప్ రాజకీయాలు ప్రారంభం అ య్యా యి. గొ ల్ల పూ డి  దే వి నే ని ఉమా నివాసంలో టీడీపీ క్యాంప్ వెయ్యగా..  ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ స్వగ్రామం ఐతవరం లో వైసీపీ క్యాంప్ నిర్వహిస్తోంది.  కొండపల్లి మున్సిపాలిటీలో మొత్తం 29 వార్డులు ఉండగా..  14 వార్డులు వైసీపీ, 14 వార్డులు టీడీపీ ఒక వార్డులో ఇండిపెండెంట్ విజయం సాధించిన సనగతి మన అందరికీ తెలిసిందే.  అయితే అనూహ్యంగా టిడిపి పార్టీ కి  గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి లక్ష్మి మద్దతు పలిపి.. అధికార వైసీపీకి ఊహించని షాక్ ఇచ్చారు.  ఎంపీ కేశినేని నానిని టార్గెట్ చేస్తున్న వైసీపీ పార్టీ ఎలాగైనా కొండపల్లి పై జెండా ఎరగవేయాలని ఆలోచన చేస్తోంది. ఆఖరి నిమిషంలో అధికారపక్షం ఎటువంటి ఎత్తులు వేస్తుందోనన్న టెన్షనులో టీడీపీ ఉంది. అయితే దీనిపై అసలు క్లారిటీ రావాలని..   ఇవాళ ఉదయం 11 :3 0 కు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: