టీడీపీ దూకుడు పెరిగే అవ‌కాశం ఉందా?  వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఇత‌ర పార్టీల‌తో పొత్తు పెట్టుకుని టీడీపీ పుంజుకునే చాన్స్ ఉందా? అంటే.. వైసీపీ నేత‌లు వేస్తున్న అంచ‌నాల ప్ర‌కారం.. ఔన‌నే అంటున్నారు. ఎందుకంటే.. దెబ్బ‌తిన్న పులి.. ఊరికేనే ఉండ‌ద‌ని.. వారు గుస‌గుస‌లాడుతున్నారు. చంద్ర‌బాబు ఇప్ప‌టికే చాలా ఓట‌ములు చ‌వి చూశారు. రాజ‌కీయాల్లో ఆయ‌న త‌న‌కు స‌మానులను ఎదిరించారు. అదేవిధంగా త‌న‌కు సీనియ‌ర్ల‌ను కూడా ఎదిరించారు. అయితే.. త‌న‌క‌న్నా త‌క్కువ వ‌య‌సు.. అంత‌క‌న్నా త‌క్కువ అనుభ‌వం ఉన్న‌.. జ‌గ‌న్‌ను ఎదుర్కొనేందుకు ఇబ్బంది ప‌డుతున్నారు.

ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు స‌య‌మం కోసం ఎదురు చూస్తున్నార‌నేది వైసీపీ నేతల అంచ‌నా. ఈ క్ర‌మంలో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. చంద్ర‌బాబు దెబ్బ‌తిన్న పులిలా పుంజుకుంటే.. వైసీపీ ప‌రిస్థితి ఏంటి? అనేది ఇప్పుటికే ఒక అంచ‌నా కు వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. ప్ర‌ధానంగా చంద్ర‌బాబు ఎవ‌రిని టార్గెట్ చేసినా.. ఆయ‌న రాజ‌కీయంగా వ్యూహాత్మ‌కంగా వాడుకుంటార‌నే వాద‌న ఉంది. అదే ఆయ‌న‌కు ఆది నుంచి కొంత క‌లిసి వ‌చ్చింది. కొంత వ్య‌తిరేక ఫ‌లితం కూడా ఇచ్చింది. అయితే.. ఇప్పుడు ఈ వీక్‌నెస్ ను ఆధారం చేసుకుని వైసీపీ నాయ‌కులు దూకుడు ప్ర‌ద‌ర్శించాల‌ని చూస్తున్నారు.

అంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి క‌మ్మ వ‌ర్గం మొత్తంగా చంద్ర‌బాబుకు సపోర్టు చేసే అవ‌కాశం ఉంద‌ని వైసీపీ నాయ‌కులు భావిస్తున్నారు. అదేస‌మ‌యంలో జ‌న‌సేన అండ‌తో.. కాపుల‌కు కూడా చంద్ర‌బాబు గేలం వేస్తార‌ని అంటున్నారు. ఈ రెండు విష‌యాల్లో పార్టీని బ‌లోపేతం చేయ‌డం ద్వారా.. చంద్ర‌బాబుకు చెక్ పెట్టేస్తే.. ఇక‌, ఆయ‌న మ‌రోసారి కూల‌బ‌డ‌డం ఖాయ‌మ‌మ‌నే అంచనాలు వ‌స్తున్నాయి. ఈక్ర‌మంలో కాపుల‌కు, క‌మ్మ‌ల‌కు ప్రాధాన్యం పెంచి.. రాజ‌కీయంగా వారికి సుస్థిర‌త క‌ల్పించ‌డం ద్వారా.. చంద్ర‌బాబుకు చెక్ పెట్టాల‌నే ఆలోచ‌న‌ను వారు జ‌గ‌న్ దృష్టికితీసుకువెళ్తున్న‌ట్టు స‌మాచారం.

అయితే, ఇందులోనూ.. వైసీపీ ప్ర‌త్యేక‌త చాటుకునే దిశ‌గా నాయ‌కులు ప్లాన్ చేస్తున్నారు. అదేంటంటే.. ఆ రెండు వ‌ర్గాల్లోనూ.. మ‌హిళ‌ల‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని చూస్తున్నార‌ట‌. వాస్త‌వానికి కాపుల్లోనూ.. క‌మ్మ‌ల్లోనూ మ‌హిళా నాయ‌కులు చాలా త‌క్కువ‌ మంది ఉన్నారు., అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ రెండు సామాజిక వ‌ర్గాల‌లోని మ‌హిళ‌ల‌కు ఎక్కువగా టికెట్లు  ఇచ్చి.. ఇదిగోచంద్ర‌బాబు కంటే మేమే గ్రేట్ అనే నినాదాన్ని ఆ రెండు వ‌ర్గాల్లోనూ ప్ర‌చారం చేయాల‌ని చూస్తున్నార‌ట. మ‌రి ఈ వ్యూహం ఏమేర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: