కొండ‌ప‌ల్లి పురపాల‌క సంఘం చైర్మ‌న్‌, వైస్ చైర్మ‌న్‌ల హై డ్రామా కొన‌సాగిన విష‌యం విధిత‌మే. తొలుత సోమ‌వారం జ‌ర‌గాల్సిన ఎన్నిక వైసీపీ స‌భ్యులు ర‌ణ‌రంగం సృష్టించడంతో రిటర్నింగ్ అధికారి మంగ‌ళ‌వారానికి వాయిదా వేసారు. అయితే మంగ‌ళ‌వారం రోజు స‌భ్యుల‌ను లోప‌లికి ఆహ్వానించి రిజ‌స్ట‌ర్‌లో పేర్ల‌ను న‌మోదు చేసేందుకు అధికారులు సిద్ధం చేస్తుండ‌గానే.. వైసీపీ స‌భ్యులు ఎంపీ కేశినేని నానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేయ‌డం ఆరంభించారు. అదేవిధంగా బ‌ల్ల‌లు, కుర్చీల‌ను విసిరి వేసి.. ఎక్స్ అపీషియో స‌భ్యునిగా ఉన్న ఎమ్మెల్యే కృష్ణ ప్ర‌సాద్ వైసీపీ ప్రోత్స‌హించిన‌ట్టు ఊహ‌గానాలు వినిపిస్తున్నాయి.

ఎన్నిక‌ల అధికారి శివ‌నారాయ‌ణ‌రెడ్డి స‌భ్యుల‌కు స‌ర్దిచెప్పే ప్ర‌య‌త్నం చేసినా.. ప్ర‌యోజ‌నం లేక‌పోవ‌డంతో నిర‌వ‌ధికంగా వాయిదా వేసారు. మ‌రోవైపు ఈ ఎన్నిక‌పై హైకోర్టులో టీడీపీ లంచ్‌మోష‌న్ పిటిష‌న్ దాఖ‌లు చేయ‌డంతో  ఎంపీ కేశినేనితో పాటు 15 మంది కౌన్సిల‌ర్లు అక్క‌డే ఉండిపోయారు. విచార‌ణ చేప‌ట్టిన హై కోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసి బుధ‌వారం ఎన్నిక‌ను నిర్వ‌హించాల‌ని వెల్ల‌డించిన‌ది. హై కోర్టు ఆదేశాల‌తో మూడోసారి స‌మావేశానికి హాజ‌రు అయ్యారు. బుధ‌వారం ఉద‌యం తొలుత టీడీపీ స‌భ్యులు కొండ‌ప‌ల్లి మున్సిప‌ల్ కార్యాయాల‌నికి బ‌స్సులో చేరుకున్నారు. టీడీపీ స‌భ్యుల‌తో పాటు ఎంపీ కేశినేని కూడా భారీ పోలీసుల బందోబ‌స్తుతో  వ‌చ్చారు.

అయితే ఆఖ‌రి నిమిషంలో ఏమి జ‌రుగుతుందోన‌ని వైసీపీ, టీడీపీ మ‌ధ్య‌ ఉత్కంఠ కొన‌సాగింది. దేవినేని ఉమ నివాసంలో టీడీపీ క్యాంప్‌, ఎమ్మెల్యే కృష్ణప్ర‌సాద్ నివాసంలో వైసీపీ క్యాంప్ రాజ‌కీయాలు నిర్వ‌హించింది. ఉత్కంఠ మ‌ధ్య ఇవాళ ఎన్నిక నిర్వ‌హించాల‌ని హై కోర్టు ఆదేశించ‌డంతో నిర్వ‌హించారు.  భారీ భ‌ద్ర‌త మ‌ధ్య ఒక్కొక్క‌రిని అధికారులు పిల‌వ‌డంతో మున్సిప‌ల్ కార్యాల‌యం లోప‌లికి వెళ్లారు కౌన్సిల‌ర్లు. అయితే ప్రారంభంలో  సీక్రెట్ ఓటింగ్‌కు వైసీపీ స‌భ్యులు ప‌ట్టుబ‌ట్టారు.  ఆ త‌రువాత ఎన్నిక‌ను పూర్తి చేసారు అధికారులు.  టీడీపీ అభ్య‌ర్థి చిట్టిబాబుకు అనుకూలంగా 16 మంది టీడీపీ ఓట‌ర్లు చేయి ఎత్తి ఓటు వేశారు. వైసీపీ త‌రుపు చైర్మ‌న్ అభ్య‌ర్థి జోగు రాము బ‌రిలో నిలిచారు. విజేత‌ను ప్ర‌క‌టించ‌లేదు. హై కోర్టు ఆదేశాల మేర‌కు అధికారులు ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను వీడియో ద్వారా రికార్డు చేసి సీల్డ్ క‌వ‌ర్‌లో కోర్టులో అంద‌జేయ‌నున్నారు. టీడీపీకి 16 ఓట్లురాగా..వైసీపీకి 15 ఓట్లు వ‌చ్చాయి. కేశినేని నాని ఎక్స్ అపీషియో విష‌యంలో కోర్టు నిర్ణ‌యం తీసుకోనున్న‌ది. చైర్మ‌న్ ఎవ‌ర‌నేది హై కోర్టు తేల్చ‌నున్న‌ది.

మరింత సమాచారం తెలుసుకోండి: