ప్రేక్షక టాలీవుడ్ : తాత పంచిన రక్తం చేయమన్నది యుద్ధం ఇదేనా తారక్ !

క‌ష్టం వ‌స్తే క‌దిలే అన్న‌య్య లేడు
రాడు
క‌ష్టం వ‌స్తే అన్నం పెట్టే చేయి
ఎక్కడుందో తెలియ‌దు
వానొస్తే సంబ‌రం ఒక‌నాడు  
ఇవాళ దుఃఖం నా ప‌ల్లెల్లో
మీరు సినిమాలు చేయండి
టిక్కెట్లు అమ్ముకోండి కాద‌నం కానీ
సామాజిక బాధ్య‌త మ‌రిచిపోతే ఒప్పుకోం!


తార‌క రాముడు.. అందరి హితం కోరాలి.. తార‌క రాముడు నా రాముడు అంద‌రి యోగం క్షేమం అన్నీ బాగుండాలి అని క‌ద‌లి రావాలి.. అయినా నా రాముడు ఇంటికే ప‌రిమితం కాదు దేశం కానీ దేశంలో ఉన్నాడు. ఉంటే ఉన్నాడు క‌నీసం మా గోడు ప‌ట్టించుకోవాలి. మా గోడు వినిపించుకుని త‌న త‌ర‌ఫున త‌న‌వారిని పంపి, ఆప‌ద కాలంలో బువ్వ పెట్టించాలి. అవును! ఇలాంటి వేళ‌ల్లో నా రాముడు ఎక్క‌డున్నాడో తెలియ‌దు. నంద‌మూరి  రాముడికి ఎందుకీ బాధ్య‌తా రాహిత్యం. ఊరు వ‌ల్ల‌కాడు అయినా ప‌ట్టించుకోక‌పోవ‌డం త‌గ‌దు.

ఊరికి ఉత్త‌రాన ఏమున్న‌ది ఊరికి ద‌క్షిణాన ఏమున్నది.. ఉత్త‌రం ఊపు మీద లేదు.. ద‌క్షిణం దంచి కొడ‌తా లేదు.. అవును వాస్తు బాలేదు.. ఆయ‌న పాట‌లో చెప్పుకున్న విధంగా సీమ వాస్తు అస్స‌ల‌స్స‌లు బాలేదు. బాలేదు క‌దా అని వ‌దిలేస్తామా.. పాలిచ్చే త‌ల్లులు పాలు లేని బిడ్డ‌లు గుక్కెడు నీరు కోసం అల్లాడుతున్న తండ్రులు వీళ్లంద‌రినీ వ‌దిలేసి ఎంచ‌క్కా ఆర్ ఆర్ ఆర్ అప్టేడ్ రాసుకుందామా! అయ్యో! మ‌నుషులం క‌దా మ‌న త‌రువాతే సినిమా మ‌న జీవితాన్ని దాటి ఏదీ లేదు. ఈ క‌న్నీరు ఈ దుఃఖ‌దాయ‌ని అయిన కాలం అన్నవి కొంత కాల‌మే! కానీ ఆప‌ద స‌మయాల్లో ఉండాల్సింది నాయ‌కుల నుంచి కానీ క‌థానాయ‌కుల నుంచి కానీ కాస్త భ‌రోసా..ర‌క్ష‌ణ..భ‌ద్ర‌త..ఇవి కోరుకునే స‌గ‌టు అభిమానికి తార‌క్ ఏమ‌ని  చెబుతారు. నా ద‌గ్గ‌ర డ‌బ్బుల్లేవు అని చెబుతారా లేదా ఇప్ప‌టికిప్పుడు సాయం చేయ‌లేను అని చెబుతారా..

అత‌డు నంద‌మూరి అంద‌గాడు
అత‌డు నంద‌మూరి చందురోడు
అత‌డు అర‌వింద స‌మేతుడు
వీర రాఘ‌వుడు
ఆది నుంచి అంతే..

మ‌రి! సామాజిక బాధ్య‌త ఎందుకు మ‌రుస్తున్నాడు. ఎందుకు త‌న తాత తండ్రుల వార‌స‌త్వం మాత్ర‌మే చెప్పుకుంటున్నాడు. వారు చేసినంత కూడా ఈయ‌న చేయ‌డం లేదు. ఇలాంటి ప్ర‌శ్న‌లే ఇప్పుడు తార‌క్ అభిమానుల‌ను ముఖ్యంగా సీమ కేంద్రంగా ఉన్న తార‌క్ అభిమానులను వేధిస్తున్నాయి. డియ‌ర్ స‌ర్ మీరు స్పందించండి ప్లీజ్ ! ఆదుకోండి ప్లీజ్! నా వాళ్ల‌కు అన్నం పెట్టి
మీరు రియ‌ల్ హీరో అనిపించుకోండి. ఇదే నా ప్రార్థ‌న అభ్య‌ర్థ‌న కూడా!

మరింత సమాచారం తెలుసుకోండి: