నారా రోహిత్ .. టాలీవుడ్ కు పెద్దగా పరిచయం  అక్కర లేని పేరు. తిరుపతి వాసి.  సీనీరంగంలో పేరు ప్రఖ్యాతులున్న వారితో బందుత్వం ఉన్నా కూడా ... వారి వాసన ఎక్కడా లేకుండా స్వశక్తితో ఎదిగిన నటుడిగా ఇతనికి పేరుంది. ఇతను న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో సినీరంగ మెళకువలు నేర్చుకున్నారు. అక్కడి పూర్వ విద్యార్థే కాదు, మేటి విద్యార్థి కూడా.  సోలో హీగా టాలీవుడ్ లో తనదైన మార్కు చూపిస్తున్న  నటుడు. ఇతని స్వస్థం తిరుపతికి కూత వేటు దూరంలో ఉండే నారా వారి పల్లె. ఇతను కూడా టాలీవుడ్ ప్రముఖుల మాదిరిగానే  వ్యవహరించారు. వరద బాధితులను పట్టించు కోలేదు.ఈయన ఈ నెల 21 వ తేదీ తిరుపతికి వచ్చారు. అప్పటికే తిరుపతి నగరాన్ని వానలు ముంచెత్తు తున్నాయి. జన జీవనం స్థంభించి పోయింది.  కాలువల్లో పారాల్సిన నీరు రోడ్ల పైకు చేరుకుంది. ఇవేమీ ఆయనకు పట్టినట్లు లేదు. ఆయన నేరుగా తన స్వస్థలం నారావారి పల్లెకు వెళ్లారు. తన పూర్వీకుల సమాధులను సందర్శించారు. .వారికి అంజలి ఘటించారు. ఎప్పుడూ కూడా మీడియాకు దూరంగా ఉండే రోహిత్ హఠాత్తుగా మీడియా ప్రతినిథులను  నారావారి పల్లెకు ఆహ్వానించారు. అనుకోని పిలుపుకి మీడియా ప్రతినిధులు ఆశ్చర్యపోయారు. సమాధులు సందర్శించిన వార్తను కవర్ చేసుకోవడం కోసం పిలిచారని వారనుకున్నారు. ఆయన అక్కడ నివాళులర్పించడంతో సరిపెట్టుకో లేదు. పూర్వీకుల సమాధుల వద్ద నిరస కార్యక్రమం చేపట్టారు. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో జరుగుతున్న వాదోపవాదాలపై  రోహిత్ నోరు విప్పారు. తనకు, నందమూరి కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని సోదాహరణంగా మీడియా ప్రతినిధులకు వివరించారు. మాజీ ముఖ్యంమంతి చంద్రబాబు నాయుడి సతీమణి భువనేశ్వరి పై అధికార పక్ష నేతలు ఆరోపణలు చేయడం దారుణమని  వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడినా సహించేది లేదని రోహిత్ విమర్శలు చేశారు. దివంగత నందమూరి తారక రామారావు రాజకీయాలలో ఉన్నా... ఆయన కుటుంబ సభ్యులు అధికారానికి దూరంగా ఉన్నారని తెలిపారు. నందమూరి కుటుంబంపై నిందలు వేస్తే తాను సహించనని తెలిపారు. రోహిత్ వరద బాధితులను పరామర్శిస్తారని, వారికి తనకు తోచిన సాయం చేస్తారని, మీడియా ప్రతినిధులు, నారా వారి పల్లె వాసులు భావించారు. కానీ అదేం జరగ లేదు. రోహిత్ సమాధుల సంద్శనకే  తన యాత్రను పరిమితం చేసుకున్నారు.
నారా రోహిత్ మాజీ ముఖ్యమంత్రి నారా  చంద్ర బాబు నాయుడి స్వయానా సోదరుని కుమారుడు. రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు  రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి. చంద్రగిరి ఎం.ఎల్.ఏ గా ప్రజలకు సేవలందించారు. రోహిత్ కూడా  వచ్చే ఎన్నికల బరిలో ఉంటారని నారా వారి పల్లె వాసులు చాలా కాలం నుంచి చెప్పుకొస్తున్నారు. మరి.. కష్టం వచ్చినప్పుడు కనీసం పలుకరించ రెందుకో.. ?
మరింత సమాచారం తెలుసుకోండి: