రాజ‌స్థాన్ లో ఇటీవ‌ల మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ జ‌రిగింది. దీని ప్ర‌భావం 2023 ఎన్నిక‌ల్లో ఉంటుంద‌ని తెలుస్తోంది. 2019 లోక్‌స‌భ‌ల ఎన్నిక‌ల ముందు రాజ‌స్థాన్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్, చ‌త్తీస్‌ఘ‌డ్ లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీని ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చింది. కానీ, 2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఆధిక్యం సాధించింది. అయితే, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో బీజేపీ కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చింది.  ఆ రాష్ట్రంలో ర‌చించిన వ్యూహాన్నే రాజ‌స్థాన్‌లో కూడా అమ‌లు చేయాల‌ని చూసింది. కానీ, స‌చిన్ పైలెట్ తిరుగుబాటు విఫ‌ల‌యం అయింది. అశోక్ గెహ్ల‌ట్ నాయ‌క‌త్వంలో కాంగ్రెస్ పార్టీ నిల‌దొక్కుకోగ‌లిగింది. తిరుగుబాటు చేసిన చేసిన స‌చిన్ పైలట్‌ ఘ‌ర్‌వాపసీ అయ్యారు.

 
 దీంతో స‌చిన్ పైల‌ట్ వ‌ర్గానికి ప్ర‌భుత్వంలో భాగం కల్పించాల‌ని అశోక్ గెహ్లాట్ పైన అధిష్టానం ఒత్తిడి తీసుకువ‌స్తూనే ఉంది. కానీ, దానికి అశోక్ గెహ‌లాట్ అంగీక‌రించ‌డం లేదు. అయితే, పంజాబ్ ప‌రిస్థితుల‌ను చూసిన సచిన్ పైలెట్ వ‌ర్గానికి భాగం ఇచ్చేందుకు  అశోక్ గెహ‌లాట్ ఒప్పుకున్న‌ట్టు తెలుస్తోంది. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణలో స‌చిన్ పైలెట్ వ‌ర్గానికి స‌ముచిత‌న స్థానం క‌ల్పించ‌డంతో  పార్టీలో కొంతమేర అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు తగ్గిన‌ట్టు క‌నిపిస్తోంది. అలాగే, ఇటీవ‌ల కాలంలో కాంగ్రెస్ ద‌ళిత సామాజిక వ‌ర్గానికి పెద్ద‌పీట వేస్తోంది.


 గుజ‌రాత్‌లో ద‌ళిత నాయ‌కుడితో మొద‌లుకుని, పంజాబ్‌లో ద‌ళిత ఎమ్మెల్యేను ముఖ్య‌మంత్రి కుర్చీలో కూర్చోబెట్టింది కాంగ్రెస్‌.. దీంతో ద‌ళిత ఓట్ల‌ను ఆక‌ర్షించాల‌ని చూస్తోంది. ఇప్పుడు రాజ‌స్థాన్‌లో కూడా ఇదే ర‌క‌మైన వ్యూహాన్ని అమ‌లు చేస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో రాజ‌స్థాన్‌లో బీజేపీని ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి రావ‌డానికి ద‌ళిత ఓట్లు ప్ర‌ధాన పాత్ర పోషించాయి. ఇదే క్ర‌మంలో 2023 ఎన్నిక‌ల్లో కూడా తిరిగి కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ద‌ళిత ఓట్లు కీల‌కం కానున్నాయి. దీంతో ఎస్సీ, ఎస్టీ సీట్లలో త‌మ ఆధిప‌త్యం నిల‌బెట్ట‌కోవ‌డానికి వ్యూహాలు ర‌చిస్తోంది. దీంట్లో భాగంగానే న‌లుగురు ఎస్సీల‌ను మంత్రులుగా తీసుకున్నారు. రాహుల్ గాంధీ ఆధ్వ‌ర్యంలో నిర్వహించిన ఈ ఆప‌రేష‌న్ 2023 వ‌ర‌కు ఎలా కొనసాగుతుందో చూడాలి.


 


   


మరింత సమాచారం తెలుసుకోండి: