సిమ్మ‌టి సీక‌టిలో మేమున్నాం
మమ్మ‌ల్ని ఆదుకోవాలి
కొమ్మ‌ల్లో కోయిల వాన‌కు వ‌ణికిన తీరులో
ఉన్నాం మ‌మ్మ‌ల్ని ఆదుకోవాలి
డియ‌ర్ తార‌క్ డియ‌ర్ మ‌హేశ్
ఇంకా
డియ‌ర్ అండ్ నియ‌ర్ టాలీవుడ్
మ‌మ్మ‌లి ఆదుకోవాలి
మా సీమ‌ను మా యాసను మా పాట‌ను మా క‌థ‌ను
వాడుకున్నందుకు అయినా ఆదుకోవాలి
క‌థ‌కో క‌థ‌న అవ‌స‌రాలకో మాత్ర‌మే మేం గుర్తుకువ‌చ్చి
ఇప్పుడు మాత్రం మ‌మ్మ‌ల్ని ఇలా వ‌దిలేసి పోతున్న
మీ నిర్ల‌క్ష్య వైఖ‌రో ధోర‌ణో న‌శించాలి


దివిసీమ ఉప్పెన వేళ నిరాశ్ర‌యుల‌యిన, నిర్భాగ్యుల‌యిన వారిని ఆ రోజు ఎన్టీఆర్ ఏఎన్నార్ లాంటి దిగ్గ‌జ న‌టులు ఆదుకున్నా రు. జోలెప‌ట్టి చందాలు దండారు. ప్ర‌జ‌ల సొమ్ముతో పాటు కొంత త‌మ వ్య‌క్తిగ‌త సొమ్మూ కలిపారు. ఆ రోజు ఆద‌ర్శంగా నిలిచారు. ఆ త‌రువాత ఎన్నో సంద‌ర్భాల్లో టాలీవుడ్ పెద్ద‌లు క‌ష్టం అంటే క‌దిలారు. అన్నం పెట్టి పంపారు. కానీ ఇప్పుడు బాధ్య‌త విడిచి, క‌ర్త వ్య దీక్ష విడిచి ఉండ‌డంలో అర్థం లేదు. మా పాట ను మీరు వాడుకున్నారు.. మా అమ్మోరు త‌ల్లి దీవెన‌ల‌తోనే మా పాట వాడుకు న్నారు. మా నేల త‌ల్లి మా రెడ్డమ్మ త‌ల్లి బాధ‌ను మీరు క‌రెన్సీ రూపంలో మార్చుకున్నారు. మేం ర‌గ‌త‌పు సింధువుల్లో తడిసి ఉం టే మీరు సినిమాలు తీశారు.. మేం క‌రువుతో అల్లాడిపోతే మీరు సినిమాలు తీశారు. మేం తిండి లేక కొండ‌పొలానికి పోతే మీరు సి నిమా తీశారు. మా పాట‌ను మా పెంచ‌ల దాసునూ మీరు వాడుకున్నారు. మా క‌థ‌నూ మా న‌వ‌ల‌నూ అదే రీతిన గుంజుకున్నా రు. మా స‌న్న‌పు రెడ్డి వెంక‌ట రామి రెడ్డి (కొండ‌పొలం న‌వ‌లా రచ‌యిత‌) ని వాడుకున్నారు. ఇంకా ఎంద‌రెంద‌రినో! ఒక్క‌సారి మా బాధ అర్థం చేసుకోండి. మీ బాధ్య‌త‌ను మ‌రో సారి గుర్తు చేస్తున్న ఈ సంద‌ర్భం మ‌రోసారి రాకుండా చూసుకుంటే మేలు. ఈ దుః ఖంలో ఈ ఆప‌ద‌లో ఈ నిరాశ‌లో ఈ పెను చీక‌టి వాకిట‌లో ఆదుకున్న వారంద‌రినీ మా నేల త‌ల్లి దీవెన‌లు అందించుగాక!
 
- ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

మరింత సమాచారం తెలుసుకోండి: