ఏపీలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కు రంగం సిద్ధం చేస్తుందా,అమిత్ షా ఆదేశాలతో ఏపీలో వలస నేతలకు ఎపి కమలదళం ఆహ్వానాలు సిద్ధం చేసిందా.అకస్మాత్తుగా వలస నేతలను బీజేపీలో చేరికల స్కెచ్ వెనుక బీజేపీ వ్యూహమేంటి.టీడీపీ,వైసీపీలకు టార్గెట్ ఫిక్స్ చేసి బీజేపీ నేతలోకి రంగంలోకి దిగబోతున్నారా,అస్సలు అమిత్ షా తో భేటీ తరువాత కమలనాధుల టార్గెట్ ఏంటి.
 

ఏపీలో ఎలాగైనా బలపడేందుకు కమలనాధులు వ్యూహప్రతి వ్యూహాలను  సిద్ధం చేస్తున్నారు,మొన్నటి వరకు  ఒకరితో ఒకరు ఎపి బీజేపీలో  అంటి ముట్టనట్లుగా నెట్టుకొస్తున్న నేతలంతా  ఒక్కటై  ఏపీలో క్షేత్ర స్థాయిలో  బలోపేతం చేసేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు,కేంద్ర పెద్దల ఆదేశాలతో ఏపీలో సోము వీర్రాజు నేతృత్వంలో  పాగా వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న కమలదళం తాజాగా త్వరలో ఏపీలో చేరికలకు కుహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తుంది,తిరుపతి వేదికగా జరిగిన సమావేశంలో పార్టీ నేతలకు అమిత్ షా క్లాస్ తీసుకోవడంతో ఇకపై పార్టీని గదిలో పెట్టాలని సీనియర్లకు షా  వార్ణింగ్ ఇవ్వడంతో పార్టీని స్ట్రీమ్ లైన్ చేయడం కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం కోసం సోము సిద్దమయ్యారట,సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిన నాటి నుంచి నెలకొన్న రాజకీయా  పరిణామాలపై ఎపి బీజేపీ  నేతలు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని కేంద్రపార్టీ దృష్టికి తీసుకోని వెళ్లడంతో ప్రక్షాళన కోసం త్వరలో బీజేపీ ప్రత్యేకంగా  సమావేశం అవబోతున్నట్లు తెలుస్తోంది.


ఈనెల 25,26 తేదీల్లో విజయవాడలో జరిగే సమావేశంలో  కొర్ కమిటీ నిర్వహిస్తుంది బీజేపీ, ఈ సమావేశానికి ఎపి బీజేపీ ముఖ్య నేతలతో పాటు జాతీయ  బీజేపీ సహా సంఘటన ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్ జి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది,కేంద్ర హోమ్ మంత్రి పార్టీ అగ్ర నేత అమిత్ షా ఆదేశాలతో ఈ సమావేశాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్లు సమాచారం.9 రాష్ట్రాలకు ఇంచార్జ్ గా ఉన్న శివ ప్రకాష్ జి నేతృత్వంలో కొర్ కమిటీ సమావేశం జరుగుతూ ఉండటంతో ఏపీలో బీజేపీ అడుగులు ఎలా ఉండబోతున్నాయన్న చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున  నడుస్తోంది,యూపీ ఎన్నికలకు ముందు ఆ రాష్ట్రంలో బీజేపీలో పెద్ద ఎత్తున వలస నేతలకు పెద్ద పీఠ వేసి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇప్పుడు శివ ప్రకాష్ జి  ద్వారా పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేసి  ఏపీపై అదే విధంగా ఫోకస్ పెట్టిందన్న చర్చ పెద్ద ఎత్తున నడుస్తోంది.అయితే  అమిత్ షా ఆదేశాలకు అనుగుణంగా జరుగుతున్న కొర్ కమిటీ సమావేశంలో బీజేపీలో ఇతర పార్టీల నేతల చేరికలపై ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు కొందరు బీజేపీ నేతలు. ఇప్పటికే ప్రజా సమస్యల విషయంలో కార్యాచరణ సిద్ధం చేయడంతో పాటు అమరావతి రాజధాని,ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక సమస్యలు, ఉద్యోగులు, ప్రభుత్వ  పరిపాలన పరమైన అంశాలపై పార్టీ అధిష్ఠానము నుంచి ఆదేశాలు రావడంతో ఎపి నేతలకు శివ ప్రకాష్ జి  దిశానిర్దేశం చేయబోతున్నట్లు సమాచారం


ఇదిలా ఉంటె కొర్ కమిటీ సమావేశం తరువాత ఎపి బీజేపీలోకి భారీగా చేరికలు ఉండబోతున్నాయని కమలనాధులు అంటున్నారు,ఏపీలో నెలకొన్న రాజకీయ సమీకరణాలు ప్రభుత్వ వైఖరి విషయంలో ప్రతిపక్ష టీడీపీ అనుసరిస్తున్న తీరు లాంటి అంశాలను ఎరగా చూపి బీజేపీలోకి ఆహవనం పలకాలని కమలదళం యోచిస్తుంది, ఇప్పటికే టీడీపీని వీడి బీజేపీ పంచన చేరిన ఎంపీలు ఆశించిన స్థాయిలో ఇతర నేతలను బీజేపీలోకి తీసుకోని రావడంలో విఫలం అవడంతో ఇకపై నేరుగా  బీజేపీ అగ్ర నేతలను రంగంలోకి దింపి బీజేపీని బలోపేతం చేసేలా కార్యాచరణ సిద్ధం చేసిందట .ఇప్పటికే ఉత్తరాంధ్ర,రాయలసీమకు కు చెందిన మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు,పార్టీలో వైసీపీ,టీడీపీలోని అసంతృప్త జిల్లా స్థాయి మండల  స్థాయి నేతలు సైతం బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకోగా సామాజిక,రాజకీయ నేపధ్యాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడం కోసం అదును చూసి రాజకీయంగా అడుగులు వేయాలని బీజేపీ భావిస్తుందట అందులో భాగంగానే 25 26తేదీలలో  జరిగే కొర్ కమిటీ సమావేశం తరువాత ఎవరిని పార్టీలోకి ఆహ్వానించాలి అనే దానిపై స్పష్టత వస్తుందని బీజేపీ నేతలు అంటున్నారు.మోత్తానీకీ ఏపిలో బలపడెందుకు కమలనాదులు వ్యుహలు రచిస్తున్నారు,చూడాలీ మరి రాబోయో రోజుల్లో చెరికల ప్రబావం ఎంత మేరకు చూపుతుందో

మరింత సమాచారం తెలుసుకోండి: