ఆంధ్ర ప్రదేశ్ శాసన సభా సమావేశాలు. వాడీ వేడి చర్చ.  గతంలో ఆమోదం పొందిన బిల్లుల ఉప సంహరణ, అంతే కాదు.. గతంలో చేసిన తీర్మానాల ఉపసంహరణ కూడా. సందట్లో సడేమియా అన్నట్లు పలు బిల్లులకు శాసన సభ ఆమోదం.  ఇదీ ఏపి అసెంబ్లీ సమావేశాల స్థితి. కరోనా పై ఆరోగ్య శాఖా మంత్రి పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.  మంత్రి  లెక్కల్లో ఎక్కడో తేడా కొడుతోందని, వాస్తవంగా క్షేత్ర స్థాయి గణాంకాలకు దూరంగా ఉన్నాయనే విమర్శలొస్తున్నాయి.
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా మహమ్మారి ప్రళయ గర్జన చేసింది. ఇంకా కూడా  ఆ వైరస్ తాలూకు కేసులు అంతకుముందంత  కాకున్నా కొద్దో గొప్పో నమోదవుతున్నాయి. కోవిడ్-19 తోలిసారి వచ్చిన దానితో పోలిస్తే... రెండో దఫా ఎక్కుమ మంది ప్రాణాలను హరించింది. చాలా మంది  మృత్యవాత పడ్డారు.  ఎవరు ఎక్కడ మరణించారనే దాని మీద ఎప్పటి కప్పుడు ప్రభుత్నం కోవిడ్ మరణాలను నమోదు చేయలేదు. దీంతో రెండో సారి కరోనా మహమ్మారి వ్యాప్తి చెందనప్పుడు మరణించిన వారి  ఖచ్చితమైన వివరాలు ప్రభుత్వం వద్ద లేవు.  దీనికి కారణం ... ఎవరు కూడా  తమ కుటుంబ సభ్యులు కరోనా తో మరణించారని బహిర్గతం చేయక పోవడం ప్రధాన కారణం. కేవలం  ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స నిమిత్తం చేరి ప్రాణాలో కోల్పోయిన వారి వివరాలు మాత్రమే ప్రభుత్వం వద్ద ఉన్నాయి. ఇతరత్రా వైద్యం చేయించుకుని  ప్రాణాలు నిలుపుకోలేక పోయిన వారి వివరాలు ప్రభుత్వం లేవు. ఈ విషయాన్ని గతంలో అధికారులు అంగీకరించారు కూడా. అయితే సుప్రీం కోర్టు అదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఉత్తర్వులు ఇచ్చింది. కోవిడ్ మృతు కుటుంబాలకు యాభై వేల పరిహారం అందజేయమని సూచించింది. దీంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం హడావిడిగా గణాంకాలను సేకరించే పనిలో పడింది.  ఇందు కోసం గ్రామ స్థాయి నుంచి వివరాలు సేకరించే పనిలో పడింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. గ్రామ వాలంటీర్లు, కార్యదర్శుల తో పాటు, ఆరోగ్య శాఖ సిబ్బంది నుంచి కూడా గణాంకాలు తెప్పించుకుంది.  అయితే ఇవి సరైనవా, కాదా అన్న విషయాన్ని ఎలా మదింపు చేశారన్నది స్పష్టంగా లేదు. ఆంధ్ర ప్రదేశ్ ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ల  కాళీ కృష్ణ ప్రసాద్ అలియాస్ నానీ సభకు చెప్పిన సమాధానంలో  కోవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 14 వేలకు పైగా ఉందని చెప్పారు. మృతుల కుటుంబాలకు యాభై వేల రూపాయల పరిహారం అందజేస్తామని వివరించారు.మరింత సమాచారం తెలుసుకోండి: