ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులైన ఎమ్మెల్యే అయినా సరే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని టార్గెట్ గా చేసుకుని ఎవరైనా సరే వ్యాఖ్యలు చేస్తే వాళ్లను ఘాటుగా విమర్శించిన పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. ఏ మంత్రి అయినా సరే ముఖ్యమంత్రి జగన్ మీద ఈగ వాలకుండా కాస్త ఎక్కువగా కష్టపడుతుంటారు. రాజకీయంగా ఎవరెన్ని విమర్శలు చేసినా సరే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై విమర్శలు రాకుండా ఉండేందుకు గట్టిగా కష్టపడుతూ విపక్షాలను కాస్త గట్టిగానే టార్గెట్ చేసి బూతులు కూడా తిట్టే పరిస్థితి ఉంటుంది.

అయితే ముఖ్యమంత్రి వైయస్ జగన్ కు సలహాలు సూచనలు ఇచ్చే విషయంలో మంత్రులు విఫలమవుతున్నారని కేవలం ముఖ్యమంత్రి జగన్ మీద ప్రేమ చాటుకోవడమే గాని రాష్ట్ర ప్రభుత్వంలో సమర్థవంతంగా చాలా మంది మంత్రులు పనిచేయడం లేదని ఆరోపణలు వినపడుతున్నాయి. రాజకీయంగా ప్రభుత్వం ఇప్పుడు కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ అనుభవం ఉన్న మంత్రులు కేవలం జగన్ పై విపక్షాలకు గట్టిగా సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందని అదే విధంగా సలహాలు సూచనలు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది ఏంటి అనేది జగన్  కు ఏదో ఒక రూపంలో చెప్పాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

రాజకీయంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి మరింత గడ్డు పరిస్థితుల్లో తీసుకొచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కేవలం మీడియా సమావేశాల్లో తిట్ల దండకాన్ని కి మాత్రమే పరిమితం కాకుండా ఘాటు విమర్శలు మాత్రమే చేయకుండా ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇస్తే విపక్షాలపై ఎదురు దాడి మాటలు అన్ని వెళ్లాలా మంచిది కాదు అని అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా కాస్త గట్టిగా సమాధానం ఇచ్చే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి భవిష్యత్తులో అయినా సరే ఏపీ మంత్రులు ఏ విధం గా వ్యవహరిస్తారు ఏంటి అనేది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: