ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొన్ని కొన్ని విషయాల్లో ఇబ్బందులు పడుతున్నారు అనేది కొన్ని రోజుల నుంచి మనం కొన్ని అంశాలను చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. కొన్ని కొన్ని విషయాల్లో ముఖ్యమంత్రి వెనక్కు తగ్గడం అనేది గతంలో ఎప్పుడూ లేని పరిస్థితి. ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టి దానిని ఉపసంహరించుకోవడం అనేది ఈ మధ్య కాలంలో ఎప్పుడూ కూడా జరగలేదు. కానీ ఇప్పుడు మాత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ అంశానికి సంబంధించి వెనక్కి తగ్గడంతో వైసీపీలో కూడా ఆందోళన మొదలవుతుంది.

రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కొన్ని అంశాలకు సంబంధించి ఈ మధ్య కాలంలో విపక్షాలను గట్టిగా టార్గెట్ చేయలేకపోతోంది అనే భావన కూడా వ్యక్తమవుతోంది. తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు గానీ పార్టీ జాతీయ అధ్యక్షుడు గానీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గాని చేసిన విమర్శల విషయంలో చాలా మంది వైసీపీ నాయకులు సైలెంట్ గా ఉండడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని కొన్ని సలహాలు ఇచ్చే విషయంలో కూడా చాలామంది మంత్రులు విఫలం కావడం పట్ల వైసీపీ నేతల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతోంది.

అయితే ఇప్పుడు చాలా మంది ముఖ్యమంత్రి శ్రేయోభిలాషులు కొన్ని సలహాలు సూచనలు ఇస్తున్నారు.ముఖ్యమంత్రిగా జగన్ నిలబడాలి అంటే కొంతమంది ప్రభుత్వంలో గానీ పార్టీలో గానీ ఉండకూడదు అని అటువంటి వాళ్ల విషయంలో జగన్ చర్యలు తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని అంటున్నారు. వీళ్ళ మీద పార్టీ అగ్రనేతలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. కొంతమంది మంత్రులు సైలెంట్ గా ఉండటాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ కూడా జీర్ణించుకోలేకపోతున్నారని కొంతమంది ఎమ్మెల్యేలు కూడా సమర్థవంతంగా మాట్లాడలేకపోవడం జగన్ ను బాగా ఇబ్బంది పెడుతున్నారు అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.మరి దీనిపై ఎలా స్పందిస్తారో వేచి చుడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: