ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీని ముందుకు నడిపించే విషయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కాస్త ఈ మధ్యకాలంలో ఎక్కువగా కష్టపడే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయంగా కొన్ని కొన్ని అంశాలకు సంబంధించి సోము వీర్రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి అలాగే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి కాస్త ఎక్కువగానే కష్టపడుతున్నారు అనేది ఈ మధ్యకాలంలో అర్థమవుతుంది. ఇక బిజెపి కేంద్ర నాయకత్వం కూడా సోము వీర్రాజు కి కాస్త ఎక్కువగా స్వేచ్ఛ ఇచ్చిందని కొన్ని కొన్ని అంశాల్లో పోరాడాల్సింది అని కూడా చెప్పింది అని కూడా అంటున్నారు.

రాజకీయంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీకి నిలబడటం అలాగే వచ్చే ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలవడం అనేది సాధ్యం అయ్యేపని కాదు కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి జనసేన పార్టీతో కలిసి ముందుకు వెళితే మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి అనే మాట వాస్తవం. అయితే జనసేన పార్టీతో కలిసి ముందుకు వెళ్లడానికి సోము వీర్రాజు సుముఖంగా లేరని చాలా అంశాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ తో ఆయన విభేధిస్తున్నారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

అయితే అమరావతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తగ్గిన నేపథ్యంలో సోము వీర్రాజు ఇమేజ్ కాస్త పెరిగిందని ఇటీవలి కాలంలో సోము వీర్రాజు కి బాగా కలిసివచ్చే అంశమని పలువురు బీజేపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. సోము వీర్రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడానికి కేంద్ర నాయకత్వంతో కలిసి పని చేస్తున్నారని కొంతమంది ఆయన సన్నిహితులు మాట్లాడటం గమనార్హం. అమరావతి ఉద్యమానికి సంబంధించి సోము వీర్రాజు సలహాతో కేంద్ర మంత్రి చెప్పారు అని కొంతమంది బీజేపీ నాయకులు అనడం కూడా ఈ మధ్యకాలంలో ఆశ్చర్యపరచిన అంశం గా చెప్పాలి. మరి భవిష్యత్తులో సోము వీర్రాజు కి ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి ఏంటి అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp