అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సీఎం జగన్ ఊహించని నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలతో జగన్ రాజకీయం చేస్తున్నారు. ప్రత్యర్ధులకే కాదు...సొంత పార్టీ నేతల ఊహలకు అందని విధంగా జగన్ అడుగులేస్తున్నారు. తాజాగా కూడా మూడు రాజధానుల అంశంపై వెనక్కి తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచారు. రెండేళ్ల క్రితం మూడు రాజధానుల నిర్ణయం తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. ఇప్పుడు ఆ మూడు రాజధానుల బిల్లుని ఉపసంహరించుకుని మరో షాక్ ఇచ్చారు. దీంతో పాటు ఏడాది క్రితం మండలి రద్దు నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకున్నారు.

అయితే మూడు రాజధానుల విషయంలో సొంత పార్టీ నేతలు ఎలా ఫీల్ అవుతున్నారో తెలియదు గానీ, మండలి రద్దు విషయంలో వెనక్కి తగ్గడంతో మాత్రం వైసీపీ నేతలు ఆనందంగా ఉన్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎమ్మెల్సీలు...ఎందుకంటే మండలి రద్దు అయితే ఎమ్మెల్సీలు ఉండరు కాబట్టి. కానీ ఇప్పుడు మండలి రద్దు నిర్ణయంతో వారు హ్యాపీగా ఉన్నారు. అదే సమయంలో కొందరు ఎమ్మెల్సీలకు సరికొత్త ఆశలు చిగురించాయి.


ఎలాగో మండలి రద్దుపై వెనక్కి తగ్గారు కాబట్టి..ఎమ్మెల్సీలని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు ఆశావాహులు లైన్‌లో ఉన్నారని తెలుస్తోంది. ఇదే క్రమంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సైతం...మంత్రివర్గం రేసులోకి వచ్చినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం టెక్కలి ఇంచార్జ్‌గా ఉన్న దువ్వాడ...మంత్రి పదవి ఆశించే లిస్ట్‌లో ఉన్నారు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో పలువురు మంత్రి పదవిపై ఆశ పెట్టుకున్నారు. ముఖ్యంగా సీనియర్లు అయినా ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాంలు క్యాబినెట్‌లో చోటు దక్కించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్పీకర్‌గా ఉన్న తమ్మినేని...మంత్రివర్గంలో చేరాలని చూస్తున్నట్లు సమాచారం. ఇక సీనియర్లతో పాటు దువ్వాడ కూడా మంత్రి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. మండలి రద్దుతో దువ్వాడ మంత్రి ఆశలు చిగురించాయనే చెప్పొచ్చు. మరి చూడాలి జగన్..ఎమ్మెల్సీలకు మంత్రులయ్యే ఛాన్స్ ఇస్తారో లేదో.

మరింత సమాచారం తెలుసుకోండి: