విజయనగరం జిల్లా రాజకీయాల్లో కాస్త మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. మొన్నటివరకు వైసీపీ హవా ఉన్న ఈ జిల్లాలో ఇప్పుడుప్పుడే టీడీపీ కూడా పికప్ అవుతున్నట్లు కనిపిస్తోంది. అసలు గత ఎన్నికల్లో జిల్లాలో ఉన్న 9 సీట్లని వైసీపీనే గెలుచుకున్న విషయం తెలిసిందే. టీడీపీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. కానీ ఇప్పుడు పరిస్తితి మారుతుంది..కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ పికప్ అవుతున్నట్లే కనిపిస్తోంది..అలా అని పూర్తిగా వైసీపీ ఆధిక్యం తగ్గలేదు గానీ..కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం సీన్ రివర్స్ అయినట్లే ఉంది.

అలా పార్వతీపురం నియోజకవర్గంలో కాస్త టీడీపీకి అనుకూలంగా రాజకీయం మారుతున్నట్లు తెలుస్తోంది. మొదట్లో పార్వతీపురం అంటే టీడీపీకి కంచుకోటే. 1983, 1985, 1989, 1994 ఎన్నికల్లో వరుసగా టీడీపీ గెలిచేసింది...కానీ తర్వాత నుంచి సీన్ మారింది...1999, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్ గెలిచింది. మళ్ళీ 2014లో టీడీపీ విజయం సాధించింది. 2019 ఎన్నికలోచ్చేసరికి వైసీపీ విజయం సాధించింది. ఇక 2024 ఎన్నికలోచ్చేసరికి రాజకీయం మళ్ళీ మారే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

ఎస్సీ రిజర్వడ్ నియోజకవర్గంగా ఉన్న ఈ పార్వతీపురంలో వైసీపీకి బలం ఎక్కువే. ఇక్కడ వైఎస్సార్ అభిమానులు ఎక్కువ ఉంటారు...అందుకే ఆ పార్టీకి కాస్త ఆధిక్యం ఎక్కువ. కానీ ఆ ఆధిక్యం ఇప్పుడుప్పుడే తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఈ రెండున్నర ఏళ్లలో పార్వతీపురంలో వైసీపీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు...పెద్దగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలు లేవు. ఎక్కడ గొంగళి అక్కడే అన్నట్లు పరిస్తితి ఉంది.

ఏజెన్సీ ప్రాంతాల్లో సరైన రోడ్ల సౌకర్యం కల్పించలేకపోయారు. తాగునీటి వసతులు కూడా అంతంత మాత్రమే. గిరిజనులకు వైద్య, విద్యా సదుపాయాలు పెద్దగా అందడం లేదు. కాకపోతే ప్రభుత్వ పథకాలు మాత్రమే ఎమ్మెల్యేకు ఉన్న పెద్ద ప్లస్. అయితే మిగతా కార్యక్రమాలు చేయకుండా పథకాలు ఇవ్వడం వల్ల ఉపయోగం లేదనే చెప్పాలి. ఏదేమైనా పార్వతీపురంలో రాజకీయం ఫ్యాన్‌కు రివర్స్ అవుతూ..సైకిల్‌కు కలిసొస్తున్నట్లు ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: