ఏపీ రాజకీయాల్లో సీనియర్ నాయకుడుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు ఇకపై ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదా? అంటే ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలని బట్టి చూస్తే ఆయనకు ఇంకా ఛాన్స్ దొరికేలా కనిపించడం లేదు. అసలు పిల్లి...కెరీర్ కాంగ్రెస్‌లో మొదలైన విషయం తెలిసిందే. 1989, 2004, 2009 ఎన్నికల్లో రామచంద్రాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే జగన్ కోసం...కాంగ్రెస్‌ని వదిలిపెట్టి వైసీపీలో చేరి 2012 ఉపఎన్నికలో వైసీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో కూడా పిల్లి ఓటమి పాలయ్యారు. దీంతో 2019 ఎన్నికల్లో సుభాష్‌కు మండపేట సీటు ఇచ్చారు.

కానీ దరిద్రం ఏంటో గానీ..జగన్ గాలిలో సైతం సుభాష్ ఓటమి పాలయ్యారు. ఓడినా సరే జగన్..సుభాష్‌కు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేశారు. అయితే మంత్రి అయిన ఆనందం పిల్లికి ఎక్కువ కాలం లేదు. అనూహ్యంగా జగన్ మండలి రద్దు నిర్ణయం తీసుకోవడంతో సుభాష్...ఎమ్మెల్సీ, మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. వెంటనే జగన్...ఆయనకు రాజ్యసభ ఇచ్చారు. ఇప్పుడు రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నారు.

తాజాగా జగన్ మండలి రద్దు నిర్ణయం వెనక్కి తీసుకున్నారు. అలా అని పిల్లిని మళ్ళీ మంత్రివర్గంలో తీసుకోవడం కష్టం...అదేవిధంగా నెక్స్ట్ ఎన్నికల్లో సుభాష్‌కు సీటు దక్కడం కష్టమని తెలుస్తోంది. ఎలాగో రాజ్యసభ ఆరేళ్లు ఉంటుంది. పైగా తన సొంత నియోజకవర్గం రామచంద్రాపురంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ ఉన్నారు. ఇటు మండపేటలో తన చిరకాల ప్రత్యర్ధి అయినా తోట త్రిమూర్తులు ఉన్నారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చి ఎమ్మెల్సీ అయిన తోట...మండపేట ఇంచార్జ్‌గా పనిచేస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో ఈయనే మండపేటలో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది.

మరి అలాంటప్పుడు పిల్లి సుభాష్‌కు ప్రత్యక్ష ఎన్నికల బరిలో పోటీ చేసే అవకాశం దక్కనట్లే అని చెప్పొచ్చు. ఆయన రాజ్యసభ సభ్యునిగానే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇకపై ఎమ్మెల్యేగా పోటీ చేసే ఛాన్స్ సుభాష్‌కు లేనట్లే అని చెప్పొచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: