రాష్ట్రంలో కులాల వారీగా అత్యధికంగా ఉన్న ఓటర్లు కాపులే అనే సంగతి తెలిసిందే. వారే గెలుపోటములని డిసైడ్ చేస్తారు. అందుకే వారి మద్ధతు పొందేందుకు పార్టీలు కూడా కాపు నాయకులనే పోటీలో నిలబెడతారు. ముఖ్యంగా కాపు ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో కాపు అభ్యర్ధులే పోటీ చేస్తారు. అయితే గత ఎన్నికల్లో కాపులు ఎక్కువ శాతం వైసీపీకి మద్ధతు ఇచ్చారు...అందుకే ఆ పార్టీ తరుఫున పలువురు కాపు నేతలు ఎమ్మెల్యేలుగా గెలిచారు.

అయితే ఇప్పుడుప్పుడే పరిస్తితులు మారుతున్నాయి. కాపు వర్గం కాస్త వైసీపీకి యాంటీగా మారుతున్నట్లు కనిపిస్తోంది. అదే సమయంలో జనసేన గానీ టీడీపీతో జట్టు కడితే వైసీపీ కాపు ఎమ్మెల్యేలకు చిక్కులు తప్పవని చెప్పొచ్చు. ఒకవేళ అదే జరిగితే కృష్ణా జిల్లాలో నలుగురు కాపు ఎమ్మెల్యేలు ఇబ్బంది పడక తప్పదు. గత ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో 16 సీట్లు ఉంటే వైసీపీ 14 సీట్లు గెలుచుకుంది. ఈ 14 సీట్లలో నలుగురు కాపు ఎమ్మెల్యేలు ఉన్నారు.

మచిలీపట్నం నుంచి పేర్ని నాని, అవనిగడ్డ నుంచి సింహాద్రి రమేష్ బాబు, జగ్గయ్యపేట నుంచి సామినేని ఉదయభాను, కైకలూరు నుంచి దూలం నాగేశ్వరరావులు విజయం సాధించారు. ఇందులో పేర్ని మంత్రిగా కూడా ఉన్నారు. అటు సామినేని సీనియర్ ఎమ్మెల్యే. సింహాద్రి, దూలంలు మాత్రం తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచారు. అయితే వీరు అంత దూకుడుగా ఉన్నట్లు లేరు.

రెండున్నర ఏళ్లలో వీరు సొంతంగా బలమైన ఇమేజ్ తెచ్చుకోలేకపోయారు. పైగా వారి వారి నియోజకవర్గాల్లో టీడీపీ పుంజుకుంటుంది. అటు జనసేన గానీ తోడైతే వీరికి నెక్స్ట్ ఎన్నికల్లో మాత్రం గెలుపు కష్టం. అటు మచిలీపట్నంలో మంత్రి పేర్నిది కూడా అదే పరిస్తితి. గత ఎన్నికల్లోనే స్వల్ప మెజారిటీతో గెలిచారు.  ఈ సారి గానీ జనసేన..టీడీపీతో కలిస్తే పేర్నికి కష్టమే. జగ్గయ్యపేటలో జనసేన ప్రభావం లేదు..కానీ ఇక్కడ టీడీపీ బాగా పికప్ అయింది. దీని బట్టి చూస్తే సామినేని కూడా గట్టి పోటీ ఎదురుకోవాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: