గుంటూరు జిల్లాలో ఎక్కువ తెలుగుదేశం పార్టీ కంచుకోటలే ఉన్నాయని చెప్పాలి. గుంటూరులో మెజారిటీ నియోజకవర్గాలు టీడీపీకి అనుకూలంగా ఉంటాయి. అయితే గత ఎన్నికల్లోనే టీడీపీ కంచుకోటలు కుప్పకూలిపోయాయి. అదే సమయంలో కొన్ని నియోజకవర్గాలు వైసీపీ అడ్డాలుగా మారిపోయాయి. మొదట నుంచి టీడీపీకి కాస్త పట్టు తక్కువ ఉన్న మాచర్ల, బాపట్ల నియోజకవర్గాలు ఇప్పుడు వైసీపీ కంచుకోటలుగా ఉన్నాయి.

అసలు ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచి 20 ఏళ్ళు దాటేసింది. మాచర్ల, బాపట్ల నియోజకవర్గాల్లో టీడీపీ చివరిగా గెలిచింది..1999 ఎన్నికల్లోనే. ఆ తర్వాత నుంచి రెండు చోట్ల టీడీపీ గెలవలేదు. 1985, 1994, 1999 ఎన్నికల్లో బాపట్లలో టీడీపీ గెలిచింది. అంటే కేవలం మూడుసార్లు మాత్రమే. గత రెండు పర్యాయాలుగా బాపట్లలో వైసీపీ విజయం సాధిస్తుంది. వైసీపీ తరుఫున కోన రఘుపతి గెలుస్తూ వస్తున్నారు.

కోనకు బాపట్లలో మంచి ఫాలోయింగ్ ఉంది..మంచి ఎమ్మెల్యే అని ముద్ర ఉంది. అసలు ఈయన వివాదాల జోలికి వెళ్లరు. ప్రత్యర్డులపై నోరు వేసుకుని పడిపోరు. సైలెంట్‌గా ఆయన పని ఆయన చేసుకుంటారు. అందుకే కోనకు బాపట్లలో పట్టు తగ్గలేదు. కానీ ఈ సారి బాపట్లలో టీడీపీ జెండా ఎగరవేయాలని వేగేశన నరేంద్ర వర్మ గట్టి ప్రయత్నిస్తున్నారు. మరి ఆయనకు ఎంతవరకు కోనకు చెక్ పెట్టే అవకాశం దొరుకుతుందో చూడాలి.

అటు మాచర్లలో టీడీపీ నాలుగుసార్లు గెలిచింది...1983, 1989, 1994, 1999 ఎన్నికల్లోనే...అక్కడ నుంచి మాచర్లలో టీడీపీ గెలవలేదు. మాచర్ల పూర్తిగా వైసీపీకి కంచుకోటగా మారిపోయింది. ఇంకా చెప్పాలంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అడ్డాగా మారిపోయింది. వరుసగా నాలుగుసార్లు ఆయనే ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. ఇప్పటికీ పిన్నెల్లికి మాచర్లలో తిరుగులేదు. ఆయనకు చెక్ పెట్టడం టీడీపీకి సాధ్యమయ్యే పని కాదు. ఇక్కడ టీడీపీ తరుఫున కొమ్మారెడ్డి చలమారెడ్డి పనిచేస్తున్నారు. చలమారెడ్డి అంత దూకుడుగా పనిచేయడం లేదు. ఏదేమైనా మాచర్ల, బాపట్లలో ఫ్యాన్ స్పీడ్ తగ్గించడం కష్టమే అని చెప్పాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: