మూడు రాజధానుల పై వైసీపీ సర్కార్ ఎందుకు వెనక్కి తగ్గింది..? ఏడాదికి పైగా రైతులు ఆందోళన చేస్తున్న స్పందించని అధికార పార్టీ ఒక్కసారిగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది..? ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు లో భాగంగా వైసిపి ప్రభుత్వం రెండేళ్ల క్రితం తీసుకొచ్చిన బిల్లులను మళ్లీ నిన్న ఉపసంహరించుకుంది. వీటి స్థానంలో మరో కొత్త బిల్లును తీసుకొస్తామని ప్రకటించింది. అయితే ఇంత సడన్ గా వైసీపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందనే చర్చ రాష్ట్రంలో సాగుతోంది. వాస్తవానికి అసెంబ్లీ బీఏసీ సమావేశంలో కానీ మరి ఎక్కడా కానీ ఈ అంశం సర్కార్ అజెండాలో లేదు. అయినా గంటల వ్యవధిలో తీసుకున్న నిర్ణయాలతో బిల్లులు రద్దు అయిపోయాయి. దీంతో దీని వెనుక అసలు కారణం అదేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఏపీలో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లులను గతంలోనే అసెంబ్లీలో తమకున్న మెజారిటీతో నెగ్గించుకుని మండలి ఆమోదం లేకపోయినా వాటికి గవర్నర్ ముద్ర వేయించుకుంది. అయితే ఈ వ్యవహారం ఇప్పటికే న్యాయస్థానాల్లో  కలకలం రేపుతోంది. దీనిపై కోర్టు అడుగుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద సమాధానం లేకుండా పోయింది. అదే సమయంలో మరిన్ని అంశాలు కూడా తోడవడంతో రాజధాని బిల్లుల రద్దు వ్యవహారం అకస్మాత్తుగా  తెరపైకి వచ్చేసింది. దీంతో ప్రభుత్వం నిన్న హైకోర్టుకు ఈ బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకున్నట్టు చెప్పేయడం అనంతరం మధ్యాహ్నం ఉపసంహరించుకోవడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు ఎందుకు ఈ ప్రయత్నం చేశారు అనే దానిపై వివరణ ఇచ్చుకునేందుకు ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. దీంతో బిల్లుల ఉపసంహరణపై సర్వత్ర చర్చోప చర్చలు సాగుతున్నాయి.  రాజధాని బిల్లుల రద్దుకు ప్రభుత్వం చెప్పిన ఏకైక కారణం అమరావతి లో ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ఒకటో, అరశాతమో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది కాబట్టి వీటిని వెనక్కి తీసుకుంటున్నామని తిరిగి వారిని కూడా ఒప్పించి మరో బిల్లు పెడతామని ప్రభుత్వం అసెంబ్లీలో చెప్పుకొచ్చింది. అమరావతి రైతులను ఒప్పించడానికి, సాంకేతిక సమస్యల కారణంగానో అయితే ఇంత అర్జెంటుగా ఈ బిల్లుల్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరమైతే కనిపించడం లేదు.

దీంతో ప్రభుత్వానికి చంద్రబాబు ఎపిసోడ్ ను డైవర్ట్ చేసేందుకు మరో గత్యంతరం లేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. చంద్రబాబు ఎపిసోడ్ డైవర్షన్ కోసం మూడు రాజధానుల బిల్లుల్ని ఏదో రకంగా అసెంబ్లీ నుంచి ఉపసంహరించుకున్నారు సరే కానీ ఇప్పుడు ఏం జరగబోతుందన్న ప్రశ్నలు జనాల మెదళ్ళను తొలిచేస్తున్నాయి. దీంతో ప్రభుత్వానికి ఏ విధంగా చూసిన ముందు నుయ్యి వెనక గొయ్యి పరిస్థితి తప్పదన్నట్టు  టాక్ వినిపిస్తోంది. వైసీపీ సర్కార్ నిర్ణయం పై అటు రాజకీయాల్లోనూ, ప్రజల్లోనూ చర్చకు దారితీస్తోంది. దీంతో వైసిపి స్టెప్  ఏ దిశగా ఉండనుందన్నదే ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: