అన్నమయ్య ప్రాజెక్టును రి- డిజైన్ చేయాలను ఆదేశాలు జారీ చేశారు ఏపీ సిఎం జగన్ మోహన్ రెడ్డి. ఇరిగేషన్ ప్రాజెక్టులపై తక్షణ నివేదిక అందించాలని ఆదేశించారు ఏపీ సిఎం జగన్ మోహన్ రెడ్డి. రాష్ట్రంలో అన్ని ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై నివేదికలు.. 13 జిల్లాల్లో ఉన్న ఇరిగేషన్‌ ప్రాజెక్టుల భద్రతపై దృష్టిపెట్టండని పేర్కొన్నారు సిఎం జగన్ మోహన్ రెడ్డి.  డ్యాంల భద్రతపై గత ప్రభుత్వాల్లో ఇచ్చిన నివేదికలు బయటకు తీయండి.. ప్రస్తుతం ఉన్న నీటి విడుదల సామర్థ్యం, గరిష్ట వరద ప్రవాహంపై అంచనాలను మరోసారి పరిశీలించి, నివేదికలు తయారుచేయాలన్నారు సిఎం జగన్ మోహన్ రెడ్డి.   ఈ నెల 26 నుంచి వర్షాలు ఉన్నాయన్న సమాచారం నేపథ్యంలో జాగ్రత్తలు కూడా తీసుకోవాలని కోరారు సిఎం జగన్ మోహన్ రెడ్డి. 

27, 28, 29 తేదీల్లో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారని.. భారీ వర్ష సూచనపై కలెక్టర్లకు నివేదికలు పంపించండన్నారు సిఎం జగన్ మోహన్ రెడ్డి.  తద్వారా ఆయా ప్రాంతాల్లో చర్యలు తీసుకునేందుకు వీలు ఉంటుందని  నిర్ధేశం చేశారు సిఎం జగన్ మోహన్ రెడ్డి.  ఇది ఇలా దురదృష్టవశాత్తూ వరదల కారణంగా మరణించిన వారికి నష్టపరిహారాన్ని కూడా శరవేగంగా అందించామని సిఎం జగన్ కు వివరణ ఇచ్చారు  కలెక్టర్లు. మృతదేహాలు లభ్యమైన కుటుంబాలకు వెంటనే అందించామని తెలిపిన కలెక్టర్లు...  గల్లంతై ఆచూకీ లభ్యంకాని వారి విషయంలో ఎఫ్‌ఐఆర్, పంచనామాలు పూర్తిచేస్తున్నామని తెలిపారు కలెక్టర్లు.  తాగునీరు, కరెంటుకు సంబంధించి ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకూడదని,, ఆదేశించారు సిఎం జగన్. తాగునీటి అంశాన్ని అధికారులు సీరియస్‌గా తీసు కో వా ల ని .. ప్ర తి రో  జూ కూ డా వ్యక్తి గతం తా కలె క్టర్లు పర్యవేక్షించాలని కోరారు సీఏం జగన్ మోహన్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: