అదృష్టం తలుపు తట్టాలే కానీ అనుకోని విధంగా లక్ష్మీ దేవత వరాలు కురిపిస్తుంది అని చెబుతూ ఉంటారు. కొంతమంది ఇదంతా వట్టి మాటలే అని కొట్టి పారేసినా.. కొన్ని ఘటనలు చూస్తుంటే మాత్రం ఇది నిజం అని నమ్మక మానరు. ఇటీవలి కాలంలో ఎంతోమంది అదృష్టం వరించి..  కేవలం ఒక్క రాత్రిలో లక్షాధికారులు కోటీశ్వరులుగా మారిపోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అనుకోని అదృష్టం తలుపు తట్టి ఎంతోమంది ఒక్కసారిగా డబ్బున్న వారి గా మారిపోతూ ఉన్నారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో లాటరీ ద్వారా ఎంతోమంది కోట్ల రూపాయలు గెలుచుకున్న  ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఏదో సరదాగా లాటరీ టికెట్ కొనుగోలు చేసిన వారు సైతం అదృష్టవశాత్తూ కోట్ల రూపాయల గెలుచుకొని ఒక్క రాత్రిలో కోటీశ్వరులుగా మారిపోతున్న ఘటనలు ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది అని చెప్పాలి. అతనికి అదృష్టం వరించింది ఒక్కసారిగా లక్షాధికారి అయ్యే అవకాశం వచ్చేసింది. దీంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి. అతను ఒక సాదాసీదా జాలరి.. చేపలు పట్టుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.  ఇక అతని కష్టాన్ని చూసి లక్ష్మీదేవి వరాలు కురిపించి నట్లు ఉంది. ఏకంగా ఒక్క రాత్రిలోనే లక్షాధికారి గా మారిపోయాడు. ఏకంగా సదరు వ్యక్తికి దొరికిన 18 కిలోల బరువు ఉన్న చేప 1.8 లక్షల రూపాయలు పలికింది.. దీంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కర్ణాటక ఉడిపి జిల్లాలో అరుదైన చేప జాలరి వలలో చిక్కింది. ఇక ఆ చేప పేరు ఘోల్ ఫిష్. ఈ చేప బరువు ఏకంగా 18 కిలోలు ఉంది. అయితే ఈ చేప కు చాలా డిమాండ్ ఉంటుంది. ఇక ఈ చేపను వేలం వేయగా 1.8 లక్షల పలికింది. ఇక ఈ వేలంలో ఏకంగా పెద్ద మొత్తంలో ఈ చేప కు డబ్బులు రావడంతో ఆ మత్స్యకారుడు ఎంతో సంతోషం లో మునిగిపోయాడు. అయితే ఘోల్ ఫిష్ హిందూ మహాసముద్రంలో దొరుకుతుంది. ఇక ఈ చేప ఎంతో రుచికరంగా ఉండటమే కాదు ఈ చేపలో మంచి ఔషధ గుణాలు కూడా ఉంటాయి  అందుకే ఈ చేప కు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: