ధాన్యం కొనుగోళ్లు, ఇత‌ర రైతు స‌మ‌స్య‌ల‌పై కేంద్రంతో యుద్ధం చేస్తాన‌ని చెప్పిన సీఎం కేసీఆర్‌.. మంత్రులు, అధికారుల‌తో కలిసి హ‌స్తిన ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. మూడు రోజుల పాటు ప్ర‌ధాని మోడీ, కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్ కోసం ఎదురు చూశారు. కానీ, ప్ర‌ధానితో భేటికి అవ‌కాశం ల‌భించ‌లేదు. ప్ర‌ధాన మంత్రి మోడీని సోమ‌, మంగ‌ళ‌వారాల్లో క‌లిసేందుకు పీఎం ఆఫీస్ అనుమతి కోరినా అపాయింట్‌మెంట్ దొర‌క‌లేదు. బుధ‌వారం ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెర‌ర్జీ- ప్ర‌ధాని మోడీ భేటీ ఉండ‌డం వ‌ల్లేనే కేసీఆర్‌కు అవ‌కాశం ల‌భించ‌లేద‌ని స‌మాచారం. కేంద్ర ఆహార, ప్ర‌జా పంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్‌, వ్య‌వ‌సాయ శాఖ మంత్రి న‌రేంద్ర సింగ్ తోమ‌ర్ ల‌తో మాత్ర‌మే రాష్ట్ర మంత్రులు, అధికార బృందం భేటి అయింది.


  అయితే, ముఖ్యంగా ప్ర‌ధాని మోడీ, కేంద్ర మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్ ను క‌లిసేందుకు సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లార‌ని తెలిసింది. కానీ, వారి అపాయింట్ మెంట్ కేసీఆర్ కు దొర‌క‌లేదు. దీంతో కేసీఆర్ బుధ‌వారం తిరిగి హైద‌రాబాద్‌కు చేరుకున్నారు.  అయితే, బీజేపీ-సీఎం కేసీఆర్ డ్రామాలో భాగంగానే కేంద్ర పెద్ద‌లు సీఎం కేసీఆర్‌తో సంప్ర‌దింపులు జ‌ర‌ప‌ లేద‌ని ప్రతిప‌క్షాలు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. ఢిల్లీలో తెలంగాణ భ‌వ‌న్ బిల్లు రెట్టింపు అవ్వ‌డం తప్పా మ‌రోటి కాద‌ని ఎద్దెవా చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు ముందే ఆయ‌న స‌తీమ‌ణి శోభ ఆరోగ్య ప‌రీక్ష‌ల కోసం ఢిల్లీ ఎయిమ్స్‌కు వెళ్లారు.


  సీఎం స‌తీమ‌ణి శోభ ఆరోగ్య ప‌ర‌స్థితి తెలుసుకోవ‌డానికే ఢిల్లీ వెళ్లార‌ని కేంద్ర పెద్ద‌ల‌తో తేల్చుకోవ‌డానికి కాద‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఢిల్లీ ప‌ర్య‌ట‌న అసంపుర్ణంగా ముగియడంతో మ‌రోసారి ఈ నెల 26వ ఢిల్లీకి రావాల‌ని రాష్ట్ర బృందానికి కేంద్ర మంత్రులు సూచించార‌ని స‌మాచారం.  మ‌రోవైపు ఈ నెల 29 నుంచి పార్ల‌మెంట్ స‌మావేశాలు ఉన్న నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ మోడీ తో బేటీ అయ్యేందుకు అవ‌కాశం లేక‌పోవ‌డంతో తిరిగి హైద‌రాబాద్ చేరుకున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: