రాజ‌కీయాల్లో పొత్తులు, విడిపోవ‌డం స‌హ‌జం. 2014 ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీ చేసిన టీడీపీ-బీజేపీ-జ‌న‌సేన‌.. 2019 ఎల‌క్ష‌న్‌లో మాత్రం విడిగా పోటీచేశాయి. దీని ఫ‌లితంగా ఈ మూడు పార్టీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు ఈ మూడు పార్టీలు ఏకం అవుతాయ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. అందుకు త‌గ్గ‌ట్టుగానే ప‌రిణామాలు కూడా స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. తాజాగా జ‌రుగుతున్న మ‌హా పాద‌యాత్ర‌లో బీజేపీ నేత‌లు కూడా పాల్గొంటున్నారు. నెల్లూరు జిల్లాలో జ‌రుగుతున్న పాద‌యాత్ర‌లో బీజేపీ ముఖ్యనేత‌లు సోమువీర్రాజు, పురందేశ్వ‌రి, ఎంపీలు సుజ‌నా చౌద‌రి, సీఎం ర‌మేశ్‌, పీవిఎల్ న‌ర్సింహ‌రావు పాల్గొన్నారు.


  అలాగే మొద‌టి నుంచే కొంద‌రు స్థానిక బీజేపీ నేత‌లు పాల్గొంటునే ఉంటున్నారు. కానీ, అమిత్ షా సూచ‌న‌ల మేర‌కే అగ్ర నేత‌లు పాల్గొంటున్న‌ట్టు తెలుస్తోంది. అయితే, నెల్లూరు జిల్లాలో జ‌రుగుతున్న పాద‌యాత్ర‌లో టీడీపీ, బీజేపీ పార్టీల‌కు చెందిన నేత‌లు క‌లిసే ముందుకు వెళ్తున్నారు. పాద‌యాత్ర‌లో స్థానికులు రెండు పార్టీల నేత‌ల‌కు మంగ‌ళ‌హార‌తులు ఇస్తూ స్వాగ‌తం ప‌లుకుతున్నారు. పాద‌యాత్ర జ‌రిగినంతసేపు ఇరు పార్టీల నేత‌లు క‌లిసే ఉంటున్నారు. అయితే, పాద‌యాత్ర బంధం కొద్ది రోజుల‌కు మ‌రింత బ‌ల‌ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది.

 అయితే, ఈ వ్య‌వ‌హారం ఇరు పార్టీల పొత్తుకు వేదిక అవుతుంద‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఒక‌వైపు బీజేపీతో పొత్తుకు చంద్ర‌బాబు సుముఖ‌త వ్య‌క్తం చేస్తున్నారు. ఇక బీజేపీ-జ‌న‌సేన పార్టీలో ఎలాగో మిత్ర ప‌క్షాలే ఇదే స‌మ‌యంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వీరికి జ‌త‌కానున్న‌ట్టు తెలుస్తోంది. జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డిని ఎదుర్కొనేందుకు భ‌విష్య‌త్తులో త్రిముఖ పార్టీలు ఏకం అయ్యే అవ‌కాశాలు కూడా లేక‌పోలేద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అంచ‌నాలు వేస్తున్నాయి. అమిత్ షా మాత్రం టీడీపీతో పొత్తుకు దూరం ఉండాల‌ని రాష్ట్ర నేత‌ల‌కు చెప్పారు. కానీ, రానున్న రోజుల ఎలాంటి ప‌రిస్థితులు ఉంటాయోన‌ని.. ప్ర‌జ‌ల మ‌ద్ధ‌తు ఏ పార్టీకి ఉంటే దాంతో క‌లిసి నడిచేందుకు బీజేపీ సిద్ధంగానే ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: