ఆంధ్రప్రదేశ్ మంత్రుల విషయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ సీరియస్ గా ఉన్నారని ఈ నేపథ్యంలోనే కొంతమంది మంత్రులకు నేరుగా వార్నింగ్ ఇచ్చారని అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కొంతమంది మంత్రులు ఏకాంతంగా మాట్లాడారని ప్రచారం మొదలైంది. కీలక మంత్రులు కొంత మంది తో జగన్ చాలా సీరియస్ గా మాట్లాడారు అని కొన్ని కొన్ని విషయాల్లో విపక్షానికి ఘాటుగా సమాధానం ఇవ్వకపోవడంతో జగన్ నుంచి కాస్త గట్టిగా వార్నింగ్ లు కూడా వచ్చాయని ప్రచారం జరుగుతోంది. కీలక మంత్రులు కొంత మంది అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకోవడం గాని ప్రభుత్వ వ్యవహారాలు మీద పట్టించుకోవడం లేదని జగన్ సీరియస్ గా ఉన్నారని అంటున్నారు.

రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి కొంత మంది మంత్రుల నుంచి సహకారం లేకపోతే విపక్షాలు చేసిన ఆరోపణలకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే సూచనలున్నాయి. భారతీయ జనతాపార్టీ కూడా రాష్ట్రంలో పట్టు పెంచుకునేందుకు తీవ్రస్థాయిలో కష్టపడుతున్న నేపథ్యంలో మంత్రులందరూ కూడా జగన్ కు అన్ని విధాలుగా సహకారం అందించాలి. రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మంత్రులు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లడమే కాకుండా ఎంపీల ద్వారా తమ తమ నియోజకవర్గాలకు నిధుల అదేవిధంగా రాష్ట్రాలకు నిధులు వచ్చే విధంగా కూడా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది.

అయితే చాలా మంది మంత్రులు సమర్థవంతంగా లేరని అసలు ప్రభుత్వ శాఖల విషయంలో చాలామందికి రెండున్నరేళ్లయినా సరే అవగాహన రావటం లేదని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని కొన్ని కొన్ని అంశాల్లో టార్గెట్ చేసే అవకాశం ఉన్నా సరే మరి సైలెంట్ గా ఉండటం పట్ల కూడా జగన్  ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని కీలక అంశాలను జగన్ సీరియస్ గా తీసుకుని మంత్రులు ఇక ప్రజల్లోకి వెళ్లకపోతే మాత్రం కచ్చితంగా మంత్రివర్గం నుంచి తొలగిస్తామని చెప్పినట్లుగా కూడా సమాచారం..ప్రస్తుతం నెలకొన్న పరిణామాల నేపథ్యంలో మంత్రులు అలెర్ట్ గా ఉండాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సీఎం జగన్ జగన్ చెప్పినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: