పాత ఇనుము వ్యాపారం చేసేవాళ్లను చూసే ఉంటాం.. పైకి పెద్దగా కనిపించదు కానీ..ఇది ఓ మంచి వ్యాపారమే.. అవును..ఇలా పాత ఇనుము వ్యాపారం చేసే కర్ణాటకలో ఓ వ్యక్తి ఏకంగా 1700 కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టాడు.. అలాగని అంతా అంత సంపాదించలేరనుకోండి..కానీ.. అందుకు కాలం కూడా కలసిరావాలి.. మరి ఆ కర్ణాటక పాత ఇనుము వ్యాపారి విజయ రహస్యం ఏంటి.. ఆయన ఆ స్థాయిలో సంపాదించేందుకు కారణమేంటి.. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు.. తెలుసుకుందామా..


కర్ణాటకలో యూసుఫ్‌ షరీఫ్‌ అనే వ్యక్తి పాత వ్యాపారం చేస్తుండే వాడు.. ఆయన్ని కేజీఎఫ్‌ బాబు అని కూడా అనేవారు.. ఎందుకంటే ఈ యూసుఫ్‌ షరీఫ్‌ చాలా కాలం పాటు కేజీఎఫ్‌ అంటే కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌  కేంద్రంగా పాత ఇనును వ్యాపారం చేసేవాడు. ఆయనకు బాగా కలిసి వచ్చిన అంశం ఏంటంటే.. కేజీఎఫ్‌ ప్రాంతంలో పాడైపోయిన పాత ట్యాంకులు ఎక్కువగా అమ్మకానికి వచ్చేవి. యూసఫ్ బాబు వాటిని కొనుగోలు చేసేవాడు.. డిస్‌మాంటిల్ చేసే అమ్మేవాడు. ఈ వ్యాపారంలో యూసఫ్‌ బాబుకు బాగా మార్జిన్ వచ్చేది.


అలా ఆయన కోట్లకు పడగలెత్తాడు. అందుకే ఆయన్ని అంతా కేజీఎఫ్‌ బాబు అని పిలుచుకునేవారు.  చేతిలో కోట్లు తిరుగుతుండటంతో యూసఫ్ బాబు సహజంగానే ఇతర వ్యాపారాల వైపు కూడా కన్నేశారు. అలా బెంగళూరుకు మకాం మార్చేసి  రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దిగారు. అక్కడ కూడా ఆయనకు బాగా కలిసొచ్చింది. అంతే వందల కోట్ల ఆస్తులు సంపాదించేశాడు. ఇప్పుడు యూసఫ్ బాబుకు మొత్తం 23 బ్యాంకు ఖాతాలున్నాయి. ఇప్పుడు ఈ యూసఫ్ బాబుకు రూ.3  కోట్ల విలువైన 3 కార్లు ఉన్నాయి.


ఇప్పుడు ఈ పాత ఇనుము వ్యాపారి రాజకీయాల్లోనూ అడుగుపెడుతున్నాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దిగుతున్నాడు. బెంగళూరులోనే డబ్బున్న నాయకుల వరుసలో చేరిన యూసఫ్ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: