తాజాగా జ‌రుగుతున్న ఏపీ అసెంబ్లీ స‌మావేశాల్లో జ‌రుతున్న ప‌రిణామాల‌పై అధికార పార్టీ వైసీపీలోనే ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. కీల‌క‌మైన విష‌యాల‌ను పక్క‌న పెడితే.. మంత్రులు.. వైసీపీ ఎమ్మెల్యేల‌కు మ‌ధ్య స‌భ‌లో జ‌రుగుతున్న సంవాదం.. ఆస‌క్తిగా మారింది. దీంతో .. ఆయా విష‌యాలు.. వైసీపీ నేత‌ల మ‌ధ్య చ‌ర్చ‌గా మారుతున్నాయి. దీంతో అస‌లు ఎవ‌రు త‌డ‌బ‌డుతున్నారు?  మంత్రిగారా?  లేక మ‌నోడేనా? అనే చ‌ర్చ సీనియ‌ర్ల మ‌ధ్య ఆస‌క్తిగా మారింది. ఇంత‌కీ.. తాజాగా ఏం జ‌రిగిందంటే.. తూర్పుగోదావ‌రి జిల్లా ముమ్మిడి వ‌రం ఎమ్మెల్యే పొన్నాడ స‌తీష్ కుమార్‌కు.. మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజుల మ‌ధ్య స‌భ‌లో ఆస‌క్తిక‌ర విష‌యం చ‌ర్చ‌కు వ‌చ్చింది.

గ‌త ఎన్నిక‌ల‌కుముందు.. సీఎం జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌లో అనేక హామీలు ఇచ్చార‌న్న స‌తీష్‌కుమార్‌.. దీనిలో మ‌త్స్యాకారుల‌కు డీజిల్‌పై ప‌న్ను ఎత్తేస్తామ‌ని.. కూడా హామీ ఇచ్చార‌ని.. అందుకే.. వారు గుండుగు త్తుగా.. వైసీపీకి మ‌ద్ద‌తుగా నిలిచార‌ని.. ఆయ‌న పేర్కొన్నారు. అయితే.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి.. రెండున్న‌రేల్లు అయిన‌ప్ప‌టికీ.. ఈ విష‌యంలో స‌ద‌రు హామీల‌ను అమ‌లు చేయ‌లేదని.. ఆయ‌న స‌భ‌లో నే స్ప‌ష్టం చేశారు. మ‌రి ఇప్ప‌టికైనా.. మ‌త్స్య‌కారుల‌కు న్యాయం చేస్తారో.. లేదో చెప్పాల‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. దీనిపై మంత్రి సీదిరి అప్ప‌లరాజు.. ఆస‌క్తిగా స్పందించారు.

అస‌లు.. మీరు.. జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో ఇచ్చిన హామీల గురించి అంద‌రికీ తెలుసున‌ని.. కానీ.. మీరు .. మాత్రం ఆస‌క్తిగా మాట్లాడుతున్నార‌ని.. సీదిరి అన్నారు. అంతేకాదు.. అస‌లు.. మ‌త్స్య‌కారుల‌కు డీజిల్ పై ఎలాంటి హామీలు ఇవ్వ‌లేద‌ని.. రాయితీలు ఇస్తామ‌ని కూడా చెప్ప‌లేద‌ని.. ఈ విష‌యం స‌భ్యులు తెలుసుకోవాల‌ని.. పొన్నాడ‌కు స‌భ‌లోనే చుర‌క‌లు అంటించారు.

అయితే.. మ‌త్య్స‌కారుల‌కు 45 ఏళ్లు నిండిన వారికి పింఛ‌న్లు ఇస్తున్నామ‌ని.. అదేవిధంగా వ‌స‌తి దీవెన‌, విద్యాదీవెన‌.. అమ్మ ఒడిని.. వారికి కూడా అమ‌లు చేస్తున్నామ‌ని తెలిపారు. దీంతో పొన్నాడ కిమ్మ‌న‌కుండా కూర్చున్నారు. అయితే.. ఈ విష‌యం ఆస‌క్తిగా మారింది. ఎందుకంటే.. ప్ర‌శ్న అడిగిన పొన్నాడ‌కు న‌వ‌ర‌త్నాల‌పై అవ‌గాహ‌న లేదా.??  లేక‌.. మంత్రిని ఇబ్బంది పెట్టాల‌ని భావించి ఇలా ప్ర‌శ్నించారా? అనే ప్ర‌శ‌లు అధికార పార్టీ ఎమ్మెల్యేల మ‌ధ్య హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: