బిగ్ ఫైట్ అని అనేందుకు వీల్లేదు
అస‌లు యుద్ధం అనే పేరు ఇక్క‌డ వాడ‌కండి
ఎందుకంటే రేవంత్ కు అంత సామ‌ర్థం లేనేలేదు
అని ఎప్పుడో తేలిపోయింది అని  
ఓ విమ‌ర్శ‌తో కూడిన గొంతుక వినిపిస్తోంది
రేవంత్ కు వ్య‌తిరేకంగా సొంత గూటి నుంచే!
ఇదే  వాస్త‌వం అని చెప్ప‌లేం కానీ
ప‌రిణామ గ‌తులు మాత్రం విమ‌ర్శ‌ల‌కు బ‌లం చేకూరుస్తున్నాయి!


తెలంగాణ‌లో ఇంకా కొన్ని ఉద్య‌మ‌శ‌క్తులు ఉన్నాయి. తెలంగాణ‌లో ఇంకా కొన్ని బ‌లీయ‌మ‌యిన నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు ఉన్న వ‌ర్గాలు ఉన్నాయి. బ‌డుగు వ‌ర్గాల ప్ర‌తినిధులు, ద‌ళిత వర్గ ప్ర‌తినిధులు చాలా మంది రేవంత్ క‌న్నా బలంగానే ఉన్నారు. అయితే వీరికి ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయ వేదిక నిర్మాణం చేత‌గాక‌పోవ‌డం, మ‌ళ్లీ మ‌ళ్లీ కేసీఆర్ అనే పెద్ద శ‌క్తిని ఢీ కొనేందుకు ఉన్న శ‌క్తికి మ‌రింత అద‌న‌పు శ‌క్తి తోడు కాక‌పోవ‌డం అన్న‌వి పెద్ద మైన‌స్. దీంతో వీళ్ల మైలేజీ రోజురోజుకూ త‌గ్గిపోతోంది. సామాజిక శ‌క్తుల కూడిక అన్న‌ది ఇప్ప‌టికిప్పుడు రేవంత్ చేయ‌లేని ప‌ని.


ఎందుకంటే ఆయ‌న ఏ ప‌ని చేసినా త‌న లాభం ఏంట‌న్న‌ది చూసుకుంటున్నార‌ని పార్టీ కోసం పరువు కోసం ఆయ‌న ప‌నిచేయ‌డం లేద‌ని ఇప్ప‌టికీ విమ‌ర్శ‌లు వినిపిస్తూనే ఉన్నాయి ప్ర‌త్య‌ర్థి వ‌ర్గాల నుంచి! ఈ తరుణంలో కేసీఆర్ లాంటి వ్య‌క్తికి అన్నీ అనుకూలించేందుకు, ఆయ‌న జీవితం ఇంకా చెప్పాలంటే ఆయ‌న రాజ‌కీయ జీవితం వ‌డ్డించిన విస్త‌రి అయ్యేందుకు కార‌ణం కూడా రేవంత్ రెడ్డి లాంటి నేత‌లే! వీళ్లే ఆయ‌న‌కు అనుబంధ శ‌క్తులుగా వేర్వేరు పార్టీల‌లో ఉంటూ గులాబీ దండుకు ఎన‌లేని స‌హ‌కారం ఇస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు ఇప్ప‌టికీ ఎదుర్కొంటున్నార‌న్న‌ది నిజం.


వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేసీఆర్ కూ రేవంత్ కూ మ‌ధ్య హోరా హోరీ పోరు జ‌రుగుతుంది అని అనేందుకు లేదు. క‌నీసం ఆ ఊహ కూడా రానివ్వ కూడదు. ఎందుకంటే అంత‌గా ఎద‌గ‌ని కాంగ్రెస్, అంత‌గానో అనుకున్నంత‌గానో ఎదిగేందుకు అవ‌కాశం ఇవ్వ‌ని కేసీఆర్ కార‌ణంగా ఇవాళ హ‌స్తం పార్టీ పెద్ద‌లు మ‌రియు కార్య‌క‌ర్త‌లు చాలా  అంటే చాలా నిరాశలో ఉన్నారు. అలా అన‌డం క‌న్నా అస‌లు పార్టీ బ‌ల‌ప‌డేందుకు ఆశించిన స్థాయిలోనో ఊహించిన స్థాయిలోనో ప్ర‌భావం చూపేందుకు అస్సలు కృషి చేయ‌డం లేదు అని చెప్ప‌డ‌మే మేలు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో ఇంటి పార్టీకి ప్ర‌త్యామ్నాయంగా ఎదిగే శ‌క్తి కాంగ్రెస్  కాజాల‌దు. అంతేకాదు ఇప్ప‌టికీ కాంగ్రెస్ బ‌లోపేత‌మే నా ధ్యేయం అని చెప్పే రేవంత్ ను ఆయ‌న మ‌నుషుల‌నూ ఎవ్వ‌రూ న‌మ్మ‌క‌పోవ‌డం తో పాటు ఆయ‌న‌కు స‌హ‌క‌రించ‌క‌పోవ‌డం కూడా ఈ క‌థలో ఓ కొసమెరుపు.


మరింత సమాచారం తెలుసుకోండి: