సినిమా నిర్మాణ రంగంలోకి
అడుగిడిన మెగా డాట‌ర్ నిహారిక కొణిదెల
అనూహ్య రీతిలో స‌క్సెస్ అయ్యారు
ఆమె నిర్మించిన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ
ఇటీవ‌లే విడుద‌లైంది. మంచి టాక్ తో న‌డుస్తోంది
ఓటీటీల కోస‌మే నిర్మించిన ఈ చిత్రం
కొత్త క‌థ తో రూపుదిద్దుకోక‌పోయినా బాగా తెలిసిన క‌థ‌తో
క‌థ‌నంతో ఆక‌ట్టుకోవ‌డం దర్శ‌కుడి శైలికి నిద‌ర్శ‌నం అని తెలుస్తోంది.

ఈ త‌రుణంలో మ‌రికొన్ని విశేషాలు చూద్దాం

చిన్న సినిమా చింత‌లేని సినిమా అన్న ఫార్ములా ను ఇప్పుడు తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ ఒంట‌ప‌ట్టించుకోవాలి. లేదంటే ప్ర‌మాద‌మే! ఎందుకంటే పెద్ద సినిమాలు వ‌చ్చినా భారీ బ‌డ్జెట్ అంటూ హ‌డావుడి చేసినా వాటికి అనుగుణంగా  టికెట్ రేట్లు ఉండ‌బోవ‌ని నిన్న‌నే అసెంబ్లీ వేదికగా ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తేల్చేశారు. ఇందుకు సంబంధించి యాక్ట్ లో కూడా ఎమెండ్ మెంట్ తీసుకు వ‌చ్చా రు. దీంతో త‌మ‌కు చిన్నా పెద్దా అన్న తేడాలేమీ సినిమాల విష‌య‌మై లేవ‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి పేర్ని నాని. ఇలాంటి నేప‌థ్యం లో ఇప్పుడు ఇండ‌స్ట్రీని కాపాడేవి, నాలుగు కాలాల పాటూ న‌లుగురికీ ఉపాధి క‌ల్పించేవి చిన్న సినిమాలే! అందుకే జీ5 ఓటీటీ, నెట్ ఫ్లిక్స్, సోనీ లైవ్ (తెలుగు), అమెజాన్ ప్రైమ్, ఆహా లాంటి డిజిట‌ల్ సంస్థ‌లు అన్నీ  కొత్త త‌రం వినోదాన్నీ కొత్త త‌రం ప్ర‌తిభ‌నూ ప్రోత్స‌హిస్తూ పోతున్నాయి.

ఇదే కోవ‌లో ఇదే తోవ‌లో ఇంకొంద‌రు

ఈ క్ర‌మంలోనే పెళ్లి అయ్యాక నిర్మాత‌గా మారి త‌న  హోం ప్రొడ‌క్ష‌న్ లో ఒక చిత్రానికి రూప క‌ల్ప‌న చేశారు. ఇదే కోవ‌లో రేప‌టి వేళ అశ్వనీద‌త్ అమ్మాయి స్వ‌ప్నదత్, కృష్ణ అమ్మాయి మంజుల కూడా వెళ్లేందుకు ప‌రిమిత బ‌డ్జెట్ తో వెబ్ సిరీస్ లు నిర్మించేందుకు అవ‌కాశాలు పుష్క‌ల‌మ‌ని తెలుస్తోంది. పెద్ద పెద్ద సంస్థలు చిన్న చిన్న సినిమాల‌ను ప‌ట్టించుకుంటేనే  ఇండ‌స్ట్రీ కి బాగుంటుంద‌ని, ఆర్థికంగా ఇటువంటి ప‌రిణామాలు క‌లిసివ‌స్తాయ‌ని డైరెక్ట‌ర్ మారుతీ కూడా చెబుతున్నారు. క‌నుక ఇక‌పై నిహారిక కానీ మ‌రో మెగా డాట‌ర్ సుస్మిత కొణిదెల కానీ ఇటువంటి ప్ర‌యత్నాలే చేయ‌నున్నార‌ని స్ప‌ష్టంగా అర్థం అవుతోన్న ప‌రిణామం. ఇప్ప‌టికే ఈ త‌ర‌హా కాన్సెప్టుల‌కు కొత్త త‌రం న‌టీన‌టులు కూడా బాగానే క‌నెక్ట్ కావ‌డంతో  లో బ‌డ్జెట్ సినిమాల హవా అన్న‌ది మ‌రింత కాలం న‌డ‌వ‌నుంది.


ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అంటూ జీ5 ఓటీటీలో సంద‌డి చేస్తున్న ఈ వెబ్ సిరీస్ మంచి టాక్ ను తెచ్చుకుంద‌ని తెలుస్తోంది. మొత్తం ఐదు ఎపిసోడ్ల‌తో రూపుదిద్దుకున్న ఈ సినిమా ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ తో పాటు మంచి స్టోరీ వాల్యూస్ తెర‌కెక్కింద‌ని ఓ టాక్ సోష‌ల్ మీడియాలో న‌డుస్తోంది. సంగీత్ శోభ‌న్, సిమ్ర‌న్ శ‌ర్మ జోడీగా న‌టించిన ఈ సినిమా ను మెగా డాట‌ర్ నిహారిక కొణెద‌ల నిర్మించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: