టిడిపి అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు పరిస్థితి రాజకీయంగా రోజు రోజుకూ దిగజారుతూ వస్తోంది. 40 సంవత్సరాల పాటు రాజకీయాల్లో తిరుగులేకుండా ... మకుటం లేని మహారాజుగా ఉన్న చంద్రబాబు ఇప్పుడు యువతరం నేతల ముందు బేజారు అవుతున్న పరిస్థితి. అసెంబ్లీలో చంద్రబాబు ఎన్నో రకాల డ‌క్కా మొక్కీలు తిని ఉన్నారు. చంద్ర‌బాబు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అలాంటి నేత మొన్న‌ వైసీపీ నేతలు తన ఫ్యామిలీ ప్రస్తావన తీసుకు వచ్చే సరికి బోరున ఏడ్చారు. ఈ పరిణామం చంద్రబాబు లో తీవ్రమైన మార్పు న‌కు కారణమైనట్లు తెలుస్తోంది. దెబ్బకు దెబ్బ ... తిట్టు తిట్టు అన్న సూత్రాన్ని అనుసరించి ఆయన రాజకీయం చేసేందుకు డిసైడ్ అయిపోయారు అట.

ఈ క్రమంలోనే ఆయన రాజ‌కీయంగా గేరు మార్చారు అని.. దూకుడుగా ముందుకు వెళ్లే లా కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎవరైనా పోటీ చేయాలంటే కొన్ని షరతులు వర్తిస్తాయి అని కూడా ఆయన నిర్మొహమాటంగా చేస్తున్నారట. తాజాగా రాయలసీమ జిల్లాల పర్యటనలో ఉన్న చంద్రబాబు తనను క‌లిసిన కొందరు నేతల వ‌ద్ద‌ ఇదే విషయాన్ని చెప్పినట్టు తెలుస్తోంది. ఇక‌పై రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థు ల‌తో ఢీ అంటే ఢీ అనేలా ఢీ కొట్టే నేత‌ల‌కే తాను వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్లు ఇస్తాన‌ని చెప్పేశార‌ట‌.

రాజ‌కీయాల్లో యువ‌త‌ను ఎంక‌రేజ్ చేయ‌డంతో పాటు దూకుడు గా ముందుకు వెళ్లే వారినే ఇక ఎంకరేజ్ చేయాల‌ని కూడా బాబు గ‌ట్టిగా నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌. ఇలా దూకుడు గా ముందుకు వెళితేనే రాజ‌కీయంగా మ‌నుగడ సాగించ‌గ‌ల‌మ‌ని ఆయ‌న చెప్పిన‌ట్టు కూడా తెలుస్తోంది. దీనిని బ‌ట్టి తాజా ప‌రిణామాల తో చంద్ర‌బాబు లో మార్పు స్ప‌ష్టంగా క‌న‌ప‌డ‌డం గ‌మ‌నార్హం. మ‌రి బాబు రూట్లో నే ఆయ‌న పార్టీ నేత‌లు కూడా త‌మ తీరు మార్చుకుంటారేమో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: