గతంలో పాక్ వ్యవహారశైలి శృతి మించినప్పుడు భారత్ దానిపై నిర్మొహమాటంగా చర్యలకు ఉపక్రమించింది. దానిలో భాగంగా ఆర్థికంగా కానీ వ్యాపారపరంగా కానీ ఎటువంటి ఒప్పందాలకు అవకాశం లేకుండా ఈ చర్యలు ఉన్నాయి. దానితో అప్పటి వరకు ఉన్న కాస్త సంబంధబాంధవ్యాలు కూడా ఆయా సమయాలలో కనుమరుగయ్యేవి. ఎన్ని చేసినప్పటికీ పాక్ మాత్రం తన తీరు మార్చుకున్నపాపాన పోలేదు. అందుకే భారత్ వీలైనప్పుడల్లా దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. పాక్ మాత్రం చిన్న అవకాశం వచ్చినప్పటికీ భారత్ పై పగ తీర్చుకునే పనులు తప్ప మరొకటి చేయడం లేదు. ప్రస్తుతం చైనా కూడా అదే తరహాలో పాక్ కు తోడవడంతో ముందు వ్యాపార, అనంతరం ఆర్థికంగా కూడా ఆ దేశంతో ఉన్న సంబంధాలు పూర్తిగా తెంచుకుంది భారత్.

ఈ రెండు విషయాలలో భారత్ దూరంగా ఉన్నది కాబట్టి పాక్-చైనా వ్యూహాలు భారత్ లో పని చేయడం లేదు. అయినా ఏదో ఒక ప్రయత్నం మాత్రం చేస్తూనే ఉన్నాయి ఆ రెండు దేశాలు. తాజాగా చైనా తైవాన్ పై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. తైవాన్ పై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న చైనా దానిపై ఆంక్షలు పెట్టడం ఆరంభించింది. ముందుగా అక్కడ ఉన్న వ్యాపారస్తులను తమకు మద్దతు ప్రకటించాలని కోరింది. అయినా వాళ్ళు తైవాన్ కు అండగా ఉండటంతో చేసేది లేక వాణిజ్య పరంగా తైవాన్ పై విరుచుకుపడటానికి సిద్ధం అవుతుంది.

తైవాన్ ఉత్పత్తులను చైనా లో అమ్ముకోవడానికి వీలులేదని, అసలు వారి వస్తువులు దేశంలోకి రానిచ్చేది లేదని చైనా తాజాగా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం చైనా పెద్ద దేశం కాబట్టి అక్కడ భారీగా వాణిజ్యం జరుగుతున్న విషయం తెలిసిందే. రెండో అతిపెద్ద దేశం అయిన భారత్ వైపు కూడా ప్రపంచం వాణిజ్య దృష్టితోనే ఉన్న విషయం తెలిసిందే. అందుకే ఒక దేశంతో వాణిజ్య ఒప్పందాలు మానేస్తే వాళ్లకు వ్యాపార పరంగా నష్టాలు తప్పవనే ఉద్దేశ్యంతో చైనా ఈ తరహా ఆంక్షలు పెట్టింది. అయితే తైవాన్ ఇందుకు లొంగిపోతుందా భారత్ వైపు దృష్టి సారిస్తుందా లేదా మరో దారిని వెతుక్కుంటుందా లేక చైనాకు లొంగిపోతుందా అనేది వేచి చూడాల్సి ఉంది. అమెరికా లాంటి దేశాలు తైవాన్ కు అండగా ఉన్న విషయం తెలిసిందే. ఆయా దేశాలు కలిసి తైవాన్ సమస్యకు పరిష్కారం చూపే అవకాశాలు కూడా మెండుగానే ఉన్నాయని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: