బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణలో పార్టీని బలోపేతం విషయంలో చాలా సీరియస్ గా పోస్ట్ చేయడమే కాకుండా కొన్ని కొన్ని కీలక అంశాలకు సంబంధించి నాయకులను ఏకతాటి మీదకు తీసుకొచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. పార్టీలో చాలామంది నాయకులు తన మాట వినకపోవడంతో బండి సంజయ్ ఈ మధ్య కాలంలో కాస్త సీరియస్ గా ఉన్నారని కొంతమంది కీలక నాయకులకు ఆయన ఇప్పటికే కేంద్ర నాయకత్వం ద్వారా హెచ్చరికలు కూడా పంపించారు అని కొంతమంది అవసరమైతే సస్పెండ్ చేస్తామని కూడా చెప్పారని అంటున్నారు.

రాజకీయంగా పార్టీని బలోపేతం కావడానికి బండి సంజయ్ త్వరలోనే మరో కీలక అడుగు కూడా వేసే అవకాశం ఉందని కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఆయన పర్యటన చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. కొంతమంది కీలక నాయకులు బండి సంజయ్ కు సహకరించే అవకాశాలు కూడా ఉన్నాయని కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ బలహీనంగా ఉన్న నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో పర్యటించి పార్టీకి జవసత్వాలు తీసుకొచ్చే విధంగా ఆయన పర్యటించే సూచనలు ఉన్నాయని అంటున్నారు.

బండి సంజయ్ ఉమ్మడి జిల్లాల మీద ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఉందని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండి టిఆర్ఎస్ పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల మీద అదేవిధంగా ఉమ్మడి జిల్లాల మీద దృష్టి పెట్టవచ్చని అంటున్నారు.ప్రధానంగా నల్గొండ అదేవిధంగా ఖమ్మం జిల్లాలో మీద ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఉందని అదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని కాంగ్రెస్ పార్టీ అక్కడ మంచి క్యాడర్ ఉందని బండి సంజయ్ భావిస్తున్నట్టుగా కూడా భారతీయ జనతా పార్టీ వర్గాలంటున్నాయి. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ దాని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి కష్ట పడే అవకాశాలు ఉండవచ్చు అనేది రాజకీయ వర్గాల మాట. మరి ఏం చేయబోతున్నారు ఏంటనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: