కరోనా వైరస్ తుంపర్ల సాయంతో గాలిలో 3మీటర్ల వరకు ప్రయాణించగలదని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్ధారించారు. ఇతరులకు 2మీటర్ల దూరంలో ఉన్నంత మాత్రాన కరోనా సోకదనే గ్యారెంటీ లేదని తేల్చేశారు. కరోనా వైరస్ తో కూడిన తుంపర్లు గాలిలో ప్రయాణిస్తూ 2మీటర్లకు మించిన దూరంలో ఉన్నవారిని కూడా చేరుకుంటున్నట్టు పేర్కొన్నారు. మాస్కు ధరించడం, వ్యాక్సిన్ తీసుకోవడం కూడా చాలా ముఖ్యమని సూచించారు.

ఇక గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 9వేల 119 కరోనా కేసులు నమోదయ్యాయి. 10వేల 264మంది వైరస్ నుంచి కోలుకున్నారు. 396మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసులు లక్షా 9వేల 940గా ఉన్నాయి. గడిచిన 539రోజుల్లో యాక్టివ్ కేసులు తక్కువ నమోదవడం ఇదే తొలిసారి. నిన్న లక్షా 11వేల 481యాక్టివ్ కేసులుండగా.. ఈ రోజు అది మరింత తగ్గింది.


అయితే కరోనా మరణాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో కరోనా మరణాలను కేంద్రం దాస్తోందనీ.. సరైన లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే కరోనా కారణంగా మరణించిన వారి కుటుంబాలకు 4లక్షల రూపాయల చొప్పున చెల్లించాలన్నారు. కానీ ఆ రాష్ట్రం వారికి ఇప్పటికీ కరోనా సాయం అందించలేదని రాహుల్ విమర్శించారు.

మరోవైపు స్పుత్నిక్ లైట్ కరోనా టీకాను వచ్చే నెలలో అందుబాటులోకి తెస్తామని ఆర్ డీఐఎఫ్ సీఈవో కిరిల్ డిమిత్రివ్ తెలిపారు. ప్రస్తుతం టీకా క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నట్టు పేర్కొన్నారు. అయితే ఈ సింగిల్ డోస్ వ్యాక్సిన్ ను దేశంలో సరఫరా చేసేందుకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ఆర్ డీఐఎఫ్ తో ఒప్పందం చేసుకుంది.

ఇక ఈ ఏడాది చివరి నాటికి అంతర్జాతీయ విమాన సేవలు సాధారణ స్థితికి వస్తాయని కేంద్రం తెలిపింది. కరోనా కేసులు తగ్గడం, వ్యాక్సినేషన్ పెరగడంతో దీనిపై ఆలోచిస్తున్నట్టు కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింథియా చెప్పారు. గతేడాది కరోనా కారణంగా అంతర్జాతీయ విమాన సేవలు నిలిచిపోయాయి. అత్యవసర ఔషధాలు, విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల్ని తరలించేందుకు మాత్రమే అనుమతించారు. అయితే గత నెల నుంచి దేశీయంగా విమాన సేవలు ప్రారంభమయ్యాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: