తెలుగు రాష్ట్రాలలో అధికారం దక్కడంతో సరి అన్నట్టుగానే ఆయా పార్టీల తీరుతెన్నులు ఉంటున్నాయి. ఒకరు అధికారం రావడంతోనే ప్రజా నిర్లక్ష్యం చేస్తూ వస్తే, మరొకరు ప్రజల యోగక్షేమాలు అంటూ ఇతర అభివృద్ధి కేంద్రాలను మరిచిపోవడం ద్వారా తమ ప్రధాన లక్ష్యాలను విస్మరించారు. ఒకదానికి రాజధాని ఆదాయం తెచ్చిపెడుతున్నప్పటికీ అప్పులబాధ తప్పలేదు. మరోదానికి అసలు రాజధాని అనేది లేకపోవడంతో చిక్కులు తప్పడం లేదు. ఒక్కటిగా ఉన్నప్పుడు లక్ష కోట్ల బడ్జెట్ దాటని తెలుగు రాష్ట్రానికి ఇప్పుడు మాత్రం రెండున్నర లక్షల కోట్ల మేర బడ్జెట్ వేస్తున్నారు. అయినా సరిపోవడం లేదనే వార్తలు కూడా చూస్తూనే ఉన్నాం. ఒకరికి అరగని బాధ, మరొకరిది దొరకని బాధ.

రాష్ట్రాలను పట్టించుకోవడం అనే పని కేంద్రానికి ఉన్న విధులలో ఒకటి. అందుకు సవతి ప్రేమ లేకుండా అన్నిటిని సమంగా చూసుకోవాల్సి ఉంటుంది అనేది నిజం. కానీ కొన్ని రాష్ట్రాలలో అభివృద్ధి కావచ్చు, ఇతరత్రా వనరుల లభ్యత కావచ్చు అంతగా ఉండకపోవడం ద్వారా ఆయా రాష్ట్రాలపై కేంద్రం దృష్టి ఎక్కువ పెట్టడం ద్వారా అవి కూడా అభివృద్ధిలో అన్నిటికి తగ్గట్టుగా ఉండేవిధంగా చూసుకోవాల్సి ఉంటుంది. అసలు రాజధాని లేకపోవడం, ఉమ్మడి రాజధానిని నిర్లక్ష్యం చేయడం లాంటివి ఆంధ్రాకు ఎనలేని నష్టాన్ని తీసుకొస్తే, ఉన్నదాన్ని చక్కబెట్టుకోలేక అప్పులపాలైంది తెలంగాణ. ఇలా తెలుగు రాష్ట్రాలు విభజన అనంతరం లభించింది ఏమో కానీ, నష్టపోవాల్సి వచ్చింది. ఎన్ని జరిగిన చివరికి బాధితుడు పౌరులే కానీ ప్రజా ప్రతినిధులు కాలేరు కదా. ఇక్కడ కూడా అదే పరిస్థితి.

ఒక్కనాడు రాష్ట్ర పరిస్థితి అంచనా వేసి, దానిలో ఉన్న వనరులు ఏవిధంగా ఉపయోగించుకోవడం ద్వారా ముందుకు పోవాలి అనేది లేకుండా దొరికిన కాడికి అప్పులు చేసి ప్రజల నెత్తిన వాటిని రుద్దేసి, వాళ్ళు ఓడినప్పట్టికి ఈ అప్పుడలైతే వాళ్ళ ఇంటికైతే పోవు కదా. పన్నుల రూపంలో మళ్ళీ  ప్రజలే కట్టుకోవాలి. ప్రభుత్వంలో ఉన్నందుకు రాష్ట్రాన్ని ఇంకాస్త వెనక్కి తీసుకెళ్లింది కాకుండా, తరువాత మళ్ళీ అధికారం కోసం ఏ వ్యూహాలు పన్నాలి అనే ఆలోచిస్తున్నారు నేతలు. ఇదే అభివృద్ధిని మరిపిస్తూ, నిరంతరం వెర్రి రాజకీయాలకు కారణం అవుతుంది. దీనితో ఎన్నడూ లేని అభివృద్ధి సంక్షోభాన్ని తెలుగు రాష్ట్రాలు ఎదుర్కొంటున్నాయి. తెలుగు రాష్ట్రాలలో ఏ పౌరుడిని కదిపినా అభద్రతా భావంతో ఉన్నాడు తప్ప, గుండెలమీద చేయి వేసుకొని గౌరవంగా తన రాష్ట్రము పేరు కూడా చెప్పుకోలేని స్థితిలో ఉన్నాడు. అది వీళ్లు చేసిన అభివృద్ధి. రాష్ట్రాలు ఏర్పాటు చేయబడి ఎన్నాళ్లయ్యింది, పరిస్థితి ఎలా ఉంది. కారణం ఎవరైనా అనుభవిస్తుంది మాత్రం ప్రజలే.

మరింత సమాచారం తెలుసుకోండి: