తెలంగాణ నేత కేసీఆర్ ఢిల్లీలో రాణించ‌లేరు
ఆ విధంగా ఆయ‌న ఇప్ప‌టికే ఎన్నో సార్లు
విఫ‌లం అయ్యారు కూడా!
కానీ తెరవెనుక మంత్రాంగంలో మోడీ ద‌గ్గ‌ర
కేసీఆర్ కాస్త ఎక్కువ మార్కులే కొట్టేశారు
అదే స‌మయంలో జ‌గ‌న్ త‌న అక్ర‌మాస్తుల కేసుల కార‌ణంగా
తీవ్ర స్థాయిలో కేంద్రాన్ని నిల‌దీయ‌లేక‌పోతున్నార‌న్నది ఓ చేదు నిజం.
కొన్నిసార్లు హీరో కేసీఆర్ కొన్ని సార్లు హీరో మోడీ అన్ని సార్లూ జీరో మాత్రం జ‌గ‌నే !
అన్న‌ది రాజ‌కీయ ప‌రిశీల‌కుల మాట‌!ఢిల్లీ కేంద్రంగా కేసీఆర్ ను ఫోక‌స్ చేసే లీడ‌ర్ లేరు. ఆ మాట‌కు వ‌స్తే చంద్ర‌బాబు ను కూడా ఫోక‌స్ చేసే లీడ‌ర్ ఎవ్వ‌రూ లేరు. కేసీఆర్ కు కానీ చంద్ర‌బాబు కు  కానీ ఉత్త‌ర భార‌తంలో ఉన్న‌వ‌న్నీ ఉత్తుత్తి స్నేహాలే! ఆ మాట‌కు వ‌స్తే రాజ‌కీయంలో స్నేహ‌మొక తుత్తిలేండి. ఆ విధంగా కేసీఆర్ వెనుక‌బాటులో ఉన్నారు. చంద్ర‌బాబు కూడా వెనుక‌బాటుతో పాటు తీవ్ర అసంతృప్తిలోనూ ఉన్నారు. కేసీఆర్ కు క‌నీసం చెప్పుకోద‌గ్గ స్థాయిలో ఎంపీల‌యినా ఉన్నారు.


చంద్ర‌బాబుకు  జ‌గ‌న్ ఎఫెక్ట్ కార‌ణంగా అది కూడా లేకుండా పోయింది. ఏ మాట‌కు ఆ మాట ఉమ్మ‌డి రాష్ట్రంలో త‌న వ‌ద్ద ప‌నిచేసిన కేసీఆర్ ను చంద్ర‌బాబు ఇప్పటికీ చేరువ చేసుకునేందుకు, ఆయ‌న‌తో స్నేహం చేసేందుకు ఎక్కువ‌గానే ఇష్ట‌ప‌డ‌తారు. కానీ కేసీఆర్ ప‌రిణామాల రీత్యా అటు జ‌గ‌న్ తోనూ ఇటు చంద్ర‌బాబుతోనూ స్నేహం నడుపుతారు. రాష్ట్రం విడిపోయాక చంద్ర‌బాబు తో కొంత కాలం మంచి సంబంధాలే న‌డిపారు తెలంగాణ సీఎం. తరువాత జ‌గ‌న్ తో మైత్రి పెంచుకుని గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు ఎంతో చేదోడువాదోడుగా ఉన్నారు. ఆ లెక్క‌న ఇప్పుడు చంద్ర‌బాబు - కేసీఆర్ క‌న్నా, కేసీఆర్ - జ‌గ‌న్ మైత్రినే ఇంకాస్త ఎక్కువ బ‌ల‌మైంది కూడా! అయితే జ‌గ‌న్ మాత్రం ఢిల్లీ పెద్ద‌ల‌కు భ‌య‌ప‌డిపోతుంటారు.

కానీ కేసీఆర్ అలా కాదు కేసులున్నా స‌రే చాక‌చ‌క్యంగా రాజ‌కీయం న‌డిపి వాటి ఊసే ఎత్త‌నీయ‌కుండా కేంద్రంలో ఉన్న బీజేపీతో మైత్రి బంధాలు కొన‌సాగిస్తుంటారు. ఇప్ప‌టికిప్పుడు కేసీఆర్  కు బీజేపీతో పొంచి ఉన్న ప్ర‌మాదం అయితే లేదు. అదేవిధంగా ద‌క్షిణాది రాష్ట్రాల‌లో కాస్తో కూస్తో త‌మ మాట వినే సీఎంలు వీరిద్ద‌రే! ఎందుకంటే అటు త‌మిళ నాడు కానీ ఇటు కేర‌ళ కానీ ఆయ‌న మాట విన‌వు. ఒక‌వేళ ప్రాంతీయ పార్టీల మ‌ధ్య అగ్గి రాజేసి చ‌లి కాచుకుందామ‌నుకున్నా కూడా బీజేపీకి అంత సీన్ వాళ్లు ఇవ్వ‌రు గాక ఇవ్వ‌రు. అందుకే తెర‌వెనుక హీరోయిజం పండించ‌డంలో జ‌గ‌న్ కన్నా కేసీఆర్ ముందుంటారు. కానీ నార్త్ ఇండియ‌న్స్ లాబీయింగ్ ద‌గ్గర కేసీఆర్ కూడా ఓడిపోతుంటారు అప్పుడ‌ప్పుడూ!


ఏదేమ‌యినా కేంద్రం చెప్పిన విధంగా త‌లాడించే కేసీఆర్ కొన్ని సార్లు హీరోయిజం చూపేందుకు అత్యుత్సాహ ప‌డినా కూడా! మోడీ ఈ త‌ర‌హా ప్ర‌వ‌ర్త‌న‌ను క‌ట్ట‌డి చేస్తుంటారు. మోడీ - కేసీఆర్ - జ‌గ‌న్ అనే ఈ ముగ్గురిలో ఒక‌రిని మించి ఒక‌రు ప్రాంతీయ నేత‌లుగా స్థానికంగా ప‌ట్టు సాధించి ఎదిగేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఏ మేర‌కు ఫ‌లిస్తాయో మ‌రి! ఇప్ప‌టిదాకా త‌న మాట నెగ్గించుకునే క్ర‌మంలో కొన్ని సార్లు మోడీ, కొన్ని సార్లు కేసీఆర్ ఎవ‌రికి వారే తమ హీరోయిజం చూపించారు. కానీ ఏ సంద‌ర్భంలోనూ వైసీపీ మాత్రం కేంద్రానికి వ్య‌తిరేకంగా మోడీకి వ్య‌తిరేకంగా మాట్లాడి సాధించేదేమీ లేదు.
మరింత సమాచారం తెలుసుకోండి:

trs