భారతీయ జనతా పార్టీ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరించిన వైఖరిపై చాలామందికి చాలా అనుమానాలున్నాయి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై ఆయన కేంద్రంలో పోరాటం చేసే అవకాశం ఉందా లేదా అనే దానికి సంబంధించి జాతీయ స్థాయిలో కూడా కాస్త ఆసక్తికర చర్చ మొదలైంది. తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్న నేపథ్యంలో భారతీయ జనతాపార్టీ పై పోరాటం చేయడానికి సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అనేక వ్యూహాలు అనుసరించిన సరే కేంద్ర స్థాయిలో పోరాటం చేయాలి అంటే మాత్రం కచ్చితంగా సీఎం కేసీఆర్ సిద్ధం కావాల్సి ఉంటుంది అనే అంశం ప్రత్యేకంగా చెప్పాలి.

భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేంద్రం లో సీఎం కేసీఆర్ ఎదుర్కోవాలంటే మాత్రం కొన్ని కొన్ని కీలక అంశాలకు సంబంధించి జాగ్రత్తగా ముందుకు అడుగులు వేయాల్సి ఉంటుంది. భారతీయ జనతా పార్టీలో ఉన్న చాలామంది నాయకులు సీఎం కేసీఆర్ ను ఎప్పుడూ ఇబ్బంది పెడతాము అని ఎదురు చూస్తున్న తరుణంలో సీఎం కేసీఆర్ కూడా కాస్త... ఢిల్లీ నాయకులతో సత్సంబంధాలు కొనసాగించడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారని అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ గత రెండు నెలల్లో మూడు సార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని గట్టిగా టార్గెట్ చేసి విమర్శించి ఆ తర్వాత ఢిల్లీ విమానం ఎక్కడo ఢిల్లీ విమానం ఎక్కిన తర్వాత ఆయన ఎవరినీ కలుస్తున్నారు ఏంటనే దానిపై స్పష్టత ఇవ్వకపోవడం వంటివి అనేక అనుమానాలకు దారి తీస్తున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ భారతీయ జనతా పార్టీపై గట్టిగా పోరాటం చేసే అవకాశం లేదు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. మరి సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన కి ఎందుకు వెళ్తున్నారు ఏంటి అనేది కనీసం మీడియా సమావేశం పెట్టి అయినా సరే చెప్పాల్సి ఉంటుంది

మరింత సమాచారం తెలుసుకోండి: