భారతీయ జనతా పార్టీ విషయంలో సీఎం కేసీఆర్ పోరాటం చేయడం అనేది ఈ మధ్య కాలంలో కాస్త సంచలనంగా మారిన అంశంగా చెప్పాలి. భారతీయ జనతా పార్టీ ని సీఎం కేసీఆర్ టార్గెట్ చేయడానికి సంబంధించి ఆ పార్టీ నాయకులు కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేయడమే కాకుండా భారతీయ జనతా పార్టీని విమర్శించే విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించడం మాత్రం కాస్తా సంచలనం అవుతుంది. సీఎం కేసీఆర్ భారతీయ జనతా పార్టీని విమర్శిస్తున్న సరే మంత్రి హరీష్ రావు లేదా మంత్రి కేటీఆర్ లేదా నిరంజన్ రెడ్డి వంటివాళ్లు మాత్రమే మాట్లాడటం పట్ల అనేక అనుమానాలు ఉన్నాయి.

ఇక సీఎం కేసీఆర్ ఇటీవల మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ లో ధాన్యం కొనుగోలు పై కేంద్ర ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం చేయగా ఆ తర్వాత కొన్ని కొన్ని పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని వెనక్కి లాగాయి అని అంటున్నారు. అయితే సీఎం కేసీఆర్ ఇప్పుడు సైలెంట్ కావడం పట్ల ఆ పార్టీ నాయకులలో కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం చేయాలంటే ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఘాటుగా విమర్శలు చేయాల్సి ఉంటుంది.

అయితే సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లిన తర్వాత కనీసం మీడియాకు కూడా కనపడకపోవడం ఎక్కడున్నారు ఏంటి అనేది చెప్పకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సీఎం కేసీఆర్ సైలెంట్ అయ్యారు అని కేంద్ర ప్రభుత్వానికి ఆయన భయపడుతున్నారని అందుకే పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేయడం లేదని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అయితే తెలంగాణలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు మాత్రం సీఎం కేసీఆర్ ఏం చేయబోతున్నారు ఏంటి అని దాని పట్ల కాస్త ఆసక్తి కరంగా చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr