ఇంటింటికి వెళ్లి సర్వే చేసి మొదటి డోస్ వేసుకున్న వారు ఎంత మంది, రెండో డోస్ వేసుకున్న వారు ఎంత మంది వివరాలు పక్కాగా సేకరించాలి. అలాగే మొదటి డోస్ వేసుకోని వారు, మొదటి డోస్ వేసుకుని రెండో డోస్ వేసుకోని వారి వివరాలు సేకరించాలి. ఆశాలు, ఎ.ఎన్.ఎం లు, డాక్టర్లు, గ్రామ స్థాయి , సబ్  సెంటర్ మరియు  పీహెచ్ సీ స్థాయిలో ప్రణాళికలు వేసుకుని ప్రతీ వ్యక్తి రెండు డోసులు కోవిడ్ వాక్సిన్ వేసుకునేలా చూడాలి. ప్రజల్లో కోవిడ్ వాక్సిన పై ఉన్న అపోహలు, అనుమానాలు నివృత్తి చేయాలి. ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలు చేపట్టాలి. ప్రత్యేకంగా కాలేజి క్యాంపస్ లు, స్కూల్స్, హాస్టళ్లు, మార్కెట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రయివేటు కార్యాలయాలు పై ప్రత్యేక దృష్టి సారించి అక్కడ వాక్సినేషన్  కార్యక్రమం చేపట్టాలి. రాష్ట్ర వ్యాప్తంగా 5 కోట్ల 55 లక్షల కోవిడ్ వ్యాక్సిన్ డోస్ లు వేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 3 కోట్ల 60 లక్షల డోస్ సు వేశామని, మరో  1 కోటి 90  లక్షల డోస్ ల వరకు వేయాల్సి ఉందన్నారు.  తొలి కోటి డోసులు వేయడానికి 165 రోజులు పట్టగా, రెండో కోటి డోసులు వేయడానికి 78 రోజులు, 3వ కోటి డోసులు  పూర్తి చేయడానికి 27 రోజులు పట్టిందని మంత్రి హరీశ్ రావు చెప్పారు.  వాక్సినేషన్ 80 శాతం కన్నా తక్కువ ఉన్న జిల్లాల వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, ఆశాలు, ఎ.ఎన్.ఎంలతో మంత్రి హరీశ్ రావు ప్రత్యేకంగా ఈ టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.
 
 ఈ డిసెంబర్ నెలాఖరులోగా రాష్ట్రంలో వందకు వంద శాతం  కోవిడ్ వాక్సినేషన్ జరగాలని, దీనిపై   వైద్య , ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల నుంచి క్షేత్ర స్థాయి సిబ్బంది వరకు దీక్షతో పని చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్య పరిరక్షణ గురించి సమీక్షా  ఆశా వర్కర్లు మాతా-శిశు సంరక్షణపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలన్నారు. రక్తహీనతపై అవగాహన కల్పించి, వారికి అవసరమైన పోషకాహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగేలా చూడాలన్నారు. సిజేరియన్ కాన్పులు కాకుండా సాధారణ కాన్పులు జరిగేలా  అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్ రావు వైద్య, ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. అదే విధంగా పిల్లలు పుట్టిన మొదటి గంటలోపే వారికి  తల్లి పాలు తప్పకుండా అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.  పిల్లలకు  అవసరమైన సాధారణ టీకాలు 96 శాతం జరిగిందని, దీన్ని వందకు వంద శాతం జరిగేలా అన్న చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. పాము కాటు, తేలు కాటు, కుక్కు కాటుకు మందులు  పీహెచ్ సీలో అందుబాటులో ఉంచాలి బీపీ, సుగర్, క్యాన్సర్ వ్యాధి నిర్థారిత పరీక్షలు నిర్వహించి, ఈ వ్యాధులను ప్రాధమిక దశలోనే గుర్తించాలన్నారు. ఈ స్క్రీనింగ్ నిర్వహించి చికిత్స ఇవ్వడం వల్ల గుండె, కిడ్నీ, క్యాన్సర్ బారిన పడకుండా నివారించగలుగుతామని చెప్పారు. ఆశ నుండి డాక్టర్ వరకు అందరు కర్తవ్య నిర్వహణకు కార్యోన్ముఖులు కావాలని పిలుపు  అవసరమైన పరికరాలు మరియు పారిశోథకాలు అందించడం జరుగుతున్నది   ఆశ లకు 4జి సిమ్ కార్డు మరియు ANM లకు ట్యాబు లు ఇవ్వడం జరిగింది.   అన్ని ఆసుపత్రులలో వ్యాధినిర్ధారణ మరియు చికిత్స కొరకు అవసరమైన ఏర్పాట్లు చేసాం ఆసుపత్రులలో పాముకాటు , కుక్కకాటు కూడా మందులను అందుబాటులో ఉంచాము  కెసిఆర్ కిట్ , తెలంగాణ డయాగ్నొస్టిక్ సేవలను ప్రజలకు అందించాలి ANM, స్టాఫ్ నర్స్ , డాక్టర్స్ లకు PRC అందించాము. ప్రభుత్వ సిబ్బందికి అందరికి ప్రభుత్వం వేతనాలను పెంచడం జరిగింది   ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు మరింత దీక్షతో పనిచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి వైద్య సేవలు అందించి రాష్ట్రాన్ని ప్రజారోగ్య రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలపాలని వైద్య సిబ్బందికి పిలుపునిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: