తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి నమస్కరించి బాధాతప్త హృదయాలతో రాస్తున్న నాయొక్కరాజీనామా పత్రం.తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని మీ పిలుపును అందుకుని నేను భారతీయ జనతా పార్టీ, కరీంనగర్ నగర శాఖ అధ్యక్షుడిగా రాజీనామా చేసి మీ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరి అప్పుడు  జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో మీ గెలుపు కోసం పని చేయడం జరిగింది. నేను టిఆర్ఎస్ పార్టీలో చేరిన నుండి ఉద్యమ వ్యాప్తి కోసం మీ అడుగులో అడుగు వేసి మీరు ఏ పిలుపు ఇచ్చినా దాన్ని కరీంనగర్ నగరంలో అమలు పరిచి  తెలంగాణ ఉద్యమాన్ని,టిఆర్ఎస్ పార్టీని సమాంతరంగా ముందుకు తీసుకుపోవడం కోసం ఆ రోజు నుండి ఈ రోజు వరకు పని చేయడం జరిగింది. ఆ సందర్భాల్లో మీరే నాకు స్వయంగా ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని వాగ్దానం చేసినారు. ఇలా ఒకసారి కాదు, చాలా సార్లు మాట ఇచ్చారు.

 మీ మాటలు నమ్మి నేను పట్టభద్రుల నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి సిద్ధపడితే మీరు గౌరవ స్వామి గౌడ్ గారికి అవకాశం ఇచ్చారు. మీ నిర్ణయాన్ని గౌరవించి వారి గెలుపు కోసం పని చేశాను.వారి పదవీ కాలం పూర్తి అయిన తర్వాత కూడా నాకు అవకాశం కల్పిస్తానని మాట ఇచ్చి వేరే ఒకరికి అవకాశం ఇచ్చారు.అప్పటికికూడా మీ నిర్ణయాన్ని గౌరవించి పార్టీ ఎదుగుదల కోసం పని చేశాను.మీరే స్వయంగా రవీందర్ సింగ్ స్థానిక సంస్థల్లో 25 స. అనుభవం ఉంది ఇక నీకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానుని జిల్లా ప్రజాప్రతినిధుల సాక్షిగా మాట ఇచ్చారు.కానీ నేటికీ మీ మాట నిలబెట్టుకోలేక పోయారు, కనీసం మీరు ఇచ్చిన మాట మీకు గుర్తు చేద్దామని సమయం కోరితే కలవడానికి కూడా మీరు సమయం ఇవ్వడం లేదు. మీరు తెలంగాణ ఉద్యమంలో లేనివారిని, అసలు ఒక్క రోజు కూడా జై తెలంగాణ నినాదం చేయని వారిని,మీ పక్కకు చేర్చుకొని  కరీంనగర్లో పార్టీని భ్రష్టు పట్టించిన కూడా మీరు వారిని పల్లెత్తు మాట అనకుండా, ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా,ఎన్ని రకాల ఆరోపణలు కథనాలుగా  టీవీల్లో, పేపర్లలో వచ్చినా మీరు పట్టించుకోకపోవడం, అలాంటి వారిని పక్కకు చేర్చుకొని అసలుసిసలైన తెలంగాణ ఉద్యమకారులను దూరం చేసుకుంటున్నారు. ఉద్యమకారుల పరిస్థితి చూసి బాధ కలిగి కన్నీళ్లు వచ్చినా తెలంగాణ అభివృద్ధి కోసం అని ఓపికతో సహించి ఉన్నాము.

 టిఆర్ఎస్ పార్టీని కూడా కొందరి ఉద్యమ ద్రోహుల చేతిలో పెట్టి వారి చేసిందే శాసనం అన్నట్టుగా కరీంనగర్ జిల్లాలో వ్యవహరిస్తే కూడా మీ నుండి చర్యలు లేక టిఆర్ఎస్ పార్టీ పూర్తిగా వారి జేబు సంస్థగా మారడం చూస్తుంటే ఇక పార్టీలో తెలంగాణ ఉద్యమకారులకు,నిజమైన కార్యకర్తలకు స్థానం లేదని గ్రహించి టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. మీరు ఇప్పటి వరకు నా పై చూపించిన ప్రేమకు కృతజ్ఞాభివందనాలతో సర్దార్ రవీందర్ సింగ్ తన యొక్క లేఖ ద్వారా  తన యొక్క బాధనంతా చెప్పారు. మరి రవీందర్ సింగ్ నెక్స్ట్ ఏ పార్టీ లోకి వెళ్తున్నారు అనేది చాలా చర్చనీయాంశంగా మారుతోంది. ప్రస్తుతం రాజకీయాల్లో సర్దార్ రవీందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని , రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్లో చేరనున్నారు అని చాలామంది రాజకీయ నేతలు ప్రజలు గుసగుసలు పెడుతున్నారు. ఏది ఏమైనా ఆయన చివరికి ఏ పార్టీలో చేరుతారనేది ఆయన మనసుకు మాత్రమే తెలుసు. ఏం జరుగుతుందో ముందు ముందు చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: